niharika konidela latest pic viral
Niharika : మెగా ఫ్యామిలీ లో డేరింగ్ డాషింగ్ గర్ల్ గా ఉంది నిహారిక. ఆ కుటుంబం నుండి హీరోయిన్స్ రాకూడదనే నియమాన్ని బద్దలు కొట్టిన బ్యూటీ. పలు విమర్శలకు ఎదిరించి తన కోరిక నెరవేర్చుకుంది. మరి హీరోయిన్ అంటే ఫోటో షూట్స్, గ్లామర్ షోస్ కామన్. నిహారిక అదే చేశారు, చేస్తున్నారు. మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం తన భర్తతో కలిసి జోర్డాన్ ట్రిప్‌లో ఉన్నారు. అది అలా ఉంటే నిహారికకు చెందిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా డాటర్ నిహారిక గతేడాది చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు ఐజీ ప్రభాకర్ కుమారుడైన చైతన్య.. ప్రస్తుతం ఓ పేరు మోసిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్‌కు కొన్ని రోజులు మాల్దీవ్స్ దీవులకు వెళ్లారు.
అక్కడ వారి మధుర క్షణాలను నిహారిక ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పంచుకుంటూ నిహారిక మరింత పాపులర్ అయ్యారు. నిహారిక ప్రస్తుతం జోర్డాన్‌లో ఉండగా, ఈ అమ్మడు అక్కడ తెగ ఎంజాయ్ చేస్తూ తనకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంది. తాజాగా షేర్ చేసిన పిక్‌లో నిహారిక లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. మతులు పోగొట్టే విధంగా ఉన్న ఈ ముద్దుగుమ్మని చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం నిహారిక లుక్స్ స్టన్నింగ్‌గా మారాయి. ఈ మధ్య కొన్నాళ్ళు నిహారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యాక్టీవ్ లో లేదు. సడన్ గా నిహారిక ఇంస్టాగ్రామ్ ని వదిలేయడంతో ఆమె ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు.
niharika konidela latest pic viral
చివరికి నాగబాబును కూడా నిహారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ గురించి అడిగారు. దానికి ఆయన ఓ సెటైరికల్ సమాధానం చెప్పి తప్పించుకున్నారు. కొద్దిరోజులుగా నిహారిక ఇంస్టాగ్రామ్ లో తిరిగి సందడి చేస్తున్నారు. భర్తతో పాటు తన విహారానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తున్నారు. నిహారిక జోర్డాన్ దేశం వెళ్లినట్లు తెలుస్తుండగా.. అక్కడి అందమైన ప్రదేశాల్లో ఫోటోలు దిగి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు. అయితే నిహారిక మింక్ అండ్ పబ్ రైడ్ లో దొరికినప్పటి నుండి ఆమెను యాంటీ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు. ఆమె ఇంస్టాగ్రామ్ ఫోటోస్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇవేమీ పట్టించుకోని నిహారిక తన పంథాలో తాను వెళుతున్నారు.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.