Niharika Konidela : అపోలో ఆసుపత్రి వద్ద నిహారిక సందడి వీడియో వైరల్…!!
Niharika Konidela : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మంగళవారం ఉదయం జూన్ 20వ తారీకు కూతురు పుట్టడం తెలిసిందే. దాదాపు పెళ్లయిన 11 సంవత్సరాల తర్వాత చరణ్…ఉపాసన దంపతులకు కూతురు జన్మించటంతో మెగా కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. నిన్నటి నుండి చరణ్ కూతురిని చూడటానికి మెగా కుటుంబ సభ్యులు భారీ ఎత్తున హైదరాబాద్ జూబ్లీహిల్స్ హాస్పిటల్ కి తరలి వస్తున్నారు. నిన్న చిరంజీవి, అల్లు అర్జున్, అల్లు అరవింద్ మరికొంతమంది కుటుంబ సభ్యులు రావడం జరిగింది.
కాగా నేడు మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక పాపను చూడటానికి రావడం జరిగింది. చీర కట్టులో పింక్ కలర్ సారీ లో నిహారిక చాలా సాంప్రదాయబద్ధంగా.. అపోలో ఆసుపత్రిలో సందడి చేయడం జరిగింది. ఇదే సమయంలో నిన్న వైట్ కలర్ డ్రెస్ లో చాలా క్యాజువల్ లుక్ లో బన్నీ భార్య స్నేహ రెడ్డితో కలిసి అపోలో ఆసుపత్రిలో చరణ్ కూతురుని చూడడం జరిగింది. 2021లో గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్యనీ వివాహం చేసుకున్న నిహారిక అతనితో విడిపోయినట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
niharika konidela latest visuals apollo hospital
ఈ క్రమంలో ఇటీవల వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుకలో కూడా నిహారిక ఒంటరిగా మాత్రమే కనిపించడం జరిగింది. మరి ఇలాంటి తరుణంలో ఇద్దరు విడాకులు తీసుకున్నారు అన్న వార్తలకు మరింత బలం చేకూరినట్లు పరిస్థితులు నెలకొన్నాయి.
