Home » Entertainment » Niharika Konidela Niharika Interesting Comments On Samantha
Entertainment

Niharika Konidela : అలా అయినంత మాత్రాన క్రేజ్ తగ్గదు.. సమంతపై నిహారిక ఆసక్తికర కామెంట్స్..

Authored By
mallesh
The Telugu News | Published on: November 23, 2021, 8:00 pm
Advertisement

Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక .. ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఈమె మ్యారేజ్ తర్వాత కూడా సినీ రంగంలో సత్తా చాటుతోంది. మ్యారేజ్‌కు ముందర పలు కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరించిన నిహారిక.. తన పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక సమంతపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Advertisement

Niharika Konidela : మా ఆయనకు సినిమాలంటే ఇష్టమే: నిహారిక..

niharika konidela niharika interesting comments on samantha

ఇటీవల ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరైన నిహారిక.. పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంది. మెగా ఫ్యామిలీలో యాక్టివ్ పర్సన్‌గా నిహారికకు స్పెషల్ రికగ్నిషన్ ఉందని చెప్పొచ్చు. ఈ‌మె హీరోయిన్‌గా నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద అంతగా ఆకట్టుకోలేదు. అయినప్పటికీ నటిగా మాత్రం నిహారికకు మంచి గుర్తింపే వచ్చింది. తాను సక్సెస్, ఫెయిల్యూర్ రెండిటినీ ఒకేలా తీసుకుంటానని నిహారిక తెలిపింది.

Advertisement

సోషల్ మీడియాలో నిహారిక ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా పలు విషయాలపై తన అభిప్రాయాలు పంచుకుంటూనే తన సినిమా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తుంటుంది. ఇకపోతే తన సినీ కెరీర్ గురించి మాట్లాడిన నిహారిక.. సినిమాలకు మ్యారేజ్ కు సంబంధం లేదని తెలిపింది. తన భర్తకు తాను సినిమాలు చేయడం ఇష్టమేనని, అందుకే తాను మూవీస్ చేస్తున్నానని వివరించింది.

పెళ్లికి ముందర పెళ్లి తర్వాత అని ఏమీ ఉండబోదని, సమంతకు మ్యారేజ్ తర్వాత కూడా క్రేజ్ తగ్గలేదని, ఇంకా పెరిగిందని పేర్కొంది. ఓటీటీ కంటెంట్‌పైన ఫోకస్ పెట్టిన నిహారిక.. ప్రజెంట్ ‘ఒక చిన్న ఫ్యామిలీ’ అనే వెబ్ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేసింది. జీ5 లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. మొత్తం ఐదు భాగాలుగా వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు నిహారిక పేర్కొంది. నిహారిక ‘ఒక మనసు’ చిత్రంతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి