Home » Entertainment » Niharika Shares Liplock Photo
Entertainment

Niharika : లిప్ లాక్ ఫొటో షేర్ చేసిన నిహారిక.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్స్..!

Authored By
Sam C
The Telugu News | Published on: May 19, 2022, 8:30 pm
Advertisement

Niharika: మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. యాంకర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ హీరోయిన్ గా కూడా ఇండస్ట్రీలో తన ప్రస్థానం కొనసాగించింది.ఈ క్రమంలోనే జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత ఈమె పూర్తిగా సినిమాలకు దూరమై నిర్మాతగా స్థిరపడ్డారు. వివాహం అనంతరం వీరిద్దరు తల్లిదండ్రుల దగ్గర కాకుండా ఏకాంతంగా వీరి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. నిహారిక పెళ్లి తర్వాత కూడా నటించడానికి ఎంతో సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ క్రమంలోనే నిహారిక సినిమాలలో నటించడానికి తన తండ్రి నాగబాబు కుటుంబం నుంచి అనుమతి లభించింది. అయితే ఇటీవ‌ల నిహారిక ఎక్కువ‌గా వివాదాల‌తో వార్త‌ల‌లోకి ఎక్కుతుంది.ఇటీవ‌ల నిహారిక అర్ధ‌రాత్రి దాటిన త‌ర‌వాత ప‌బ్ లో ఉండ‌టంతో ఆమెతో పాటూ మ‌రికొంద‌రు సెల‌బ్రెటీల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిహారిక వెళ్లిన ప‌బ్ లో డ్ర‌గ్స్ ఆన‌వాళ్ల‌ను పోలీసులు గుర్తించ‌డంతో ఈ వార్త సెన్సేష‌నల్ అయ్యింది. ఆ త‌ర‌వాత ప‌బ్ నిర్వాహ‌కులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసును మెల్లిమెల్లిగా అంతా మ‌ర్చిపోయారు. అయితే నిహారిక పై మాత్రం సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువ‌గా వ‌చ్చాయి.

niharika shares lip lock photo

Advertisement

Niharika : నిహారిక ర‌చ్చ‌..

దాంతో నాగ‌బాబు రంగంలోకి దిగి త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌వ‌ద్దంటూ కోరారు.నిహారిక‌పై ట్రోల్సింగ్ ఎక్కువ కావ‌టంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అయితే రీసెంట్‌గానే తాను పాఠాల‌ను నేర్చుకున్నాన‌ని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఆమె రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రీ ఎంట్రీ త‌ర్వాత నిహారిక షేర్ చేసిన ఈ లిప్ లాక్ ఫొటో మ‌ళ్లీ టాపిక్‌గా మారింది. ఎప్ప‌టికీ విడిపోని బంధం అంటూ ఆమె స‌ద‌రు ఫొటోకు క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. దీనిపై నెటిజ‌న్స్ రియాక్ష‌న్స్ ఒక్కోలా ఉంది. ఏదేతైనేం నిహారిక పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అమ్మ‌డి ఇష్యూస్ ఒక్కొక్క‌టి నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి