
Nirupam Paritala Funny Quotation On Social Media
Nirupam Paritala : డాక్టర్ బాబు ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నాడు. బుల్లితెరపై సీరియళ్లతో దూసుకుపోతోన్నాడు. కార్తీకదీపం ఒక వైపు.. హిట్లర్ గారి పెళ్లాం ఇంకో వైపు. మొత్తానికి నిరుపమ్ మాత్రం మంచి స్పీడు మీదున్నాడు. ఇక సోషల్ మీడియాతో అయితే నిరుపమ్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ మధ్య యూట్యూబ్‌లో కూడా నిరుపమ్ హల్చల్ చేస్తున్నాడు. తన భార్య మంజుల ఆ యూట్యూబ్ చానెల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో ఎక్కువగా డాక్టర్ బాబు పర్సనల్ విషయాలే చెబుతుంటుంది.
ఇక నిరుపమ్ స్వతాహాగా రచయిత అన్న విషయం తెలిసిందే. నిరుపమ్ తండ్రి ఓంకార్ ఎన్నో సీరియళ్లకు కథలు, సంభాషణలు అందించారు. ఆయన ఓ రచయిత. ఆ వారసత్వం కూడా నిరుపమ్‌కు వచ్చినట్టుంది. అందుకే అప్పుడప్పుడు తనలోని రచయిత బయటకు వస్తాడు. ప్రాసలతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. తాజాగా మరోసారి తన లోని రైటింగ్ స్కిల్స్‌ను అందరికీ చూపించాడు. ప్రవచనాలు, వచనాలు అంటూ అందరినీ నవ్వించేశాడు.
Nirupam Paritala Funny Quotation On Social Media
నవ్వు నాలుగు విధాల చేటు.. కానీ జీవితంలో మాత్రం నవ్వు లేకపోవడం తీరని లోటు.. ఇది ప్రవచనాలు కాదు.. పనికొచ్చే వచనాలు అని నిరుపమ్ తన స్టైట్లో ప్రాసతో పిచ్చెక్కించాడు. మాకు క్యాప్షన్ సూచనలు, ఈ ప్రవచానాలు మాకు రోజు కావాలి డాక్టర్ బాబు.. ఆ పిక్ ఎవరు తీశారు డాక్టర్ బాబు.. మీ కంట్లో నీళ్లు ఎందుకు వచ్చాయ్ డాక్టర్ బాబు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అలా నిరుపమ్ వేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.