Home » Entertainment » Nirupam Paritala Wife Manjula Dasara Special Video
Entertainment

Nirupam Paritala : డాక్టర్ బాబు ఇంట్లో విషాదం.. అందుకే ఇలా అంటోన్న మంజుల

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: October 13, 2021, 11:20 am
Advertisement

Nirupam Paritala : కార్తీకదీపం డాక్టర్ బాబుగా నిరుపమ్ ఇప్పుడు సంపాదించుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా నిరుపమ్ బుల్లితెరపై సూపర్ స్టార్‌గా ఎదిగాడు. నిరుపమ్ భార్యగా మంజుల కూడా నెట్టింట్లో ఫుల్ ఫేమస్ అయింది. ఆమె కూడా బుల్లితెర నటి. కానీ నిరుపమ్ రేంజ్‌లో సక్సెస్ కాలేకపోయింది. చంద్రముఖి సీరియల్‌తో ఈ ఇద్దరూ కలిశారు. ఆ సీరియల్ సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తరువాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.

Advertisement

Nirupam Paritala Wife Manjula Dasara Special Video

ఇక ఇప్పుడు బుల్లితెరకు శోభన్ బాబులా మారిపోయాడు నిరుపమ్. సోషల్ మీడియాలోనూ నిరుపమ్ మామూలుగా రచ్చ చేయడం లేదు. వెరైటీ పంచులు, ప్రాసలతో ఆయన చేసే పోస్ట్‌లు వైరల్ అవుతుంటాయి. ఇక ఈ మధ్యే మంజుల నిరుపమ్ ఇద్దరూ కలిసి యూట్యూబ్ చానెల్‌‌ను పెట్టేశారు. పెట్టిన కొద్ది రోజులకే యూట్యూబ్ చానెల్ దూసుకుపోయింది. లక్షల మంది సబ్ స్క్రైబర్లు వచ్చారు. వారి వీడియోలు మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొడుతున్నాయి.Karthika

Advertisement

Nirupam Paritala : దేవీ నవరూపాల్లో మంజుల..

Nirupam Paritala Wife Manjula Dasara Special Video

ఈ మధ్యే దసరా షాపింగ్ అంటూ మంజుల నిరుపమ్ చేసిన రచ్చ మామూలుగా క్లిక్ అవ్వలేదు. నవరాత్రుల సందర్బంగా ఆమె తొమ్మిది చీరలను కొనేసింది. అయితే నిరుపమ్ ఇంట్లో విషాదం జరగడం, వారి అమ్మమ్మ మరణించడంతో పండుగలేవీ సెలెబ్రేట్ చేయడం లేదట. కానీ దసరాకు ఇలా ఏదో ఒకటి చేయాలని అభిమానుల కోసమని ఇలా దేవి నవరూపాల్లో కనిపించేందుకు మంజుల ప్రయత్నించిందిట. దీని కోసమే తొమ్మిది రకాల చీరలను కొన్నట్టు తెలిపింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి