Home » Entertainment » Not Even Two Days After Varun Tej Got Engaged Look What Nagababu Did
Entertainment

Varun Tej : వరుణ్ తేజ్ నిశ్చితార్ధం అయ్యి రెండు రోజులు కూడా కాలేదు .. నాగబాబు ఏం చేసాడో చూడండి !

Authored By
Breaking News
The Telugu News | Published on: June 11, 2023, 4:34 pm
Advertisement

Varun Tej : సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇంకా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్థం గురించే ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. జూన్ 9వ తారీకు మణికొండలోని నాగబాబు ఇంట్లో జరిగిన నిశ్చితార్థ వేడుకకి మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ మరికొంతమంది కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నిశ్చితార్థం అనంతరం నాగబాబు ఎంతో ఎమోషనల్ అయ్యారు.

Advertisement

అందమైన వధువును నా కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఎంతో పొంగిపోయాను అని అన్నారు. నా కొడుకు నిశ్చితార్థం వేలా భావోద్వేగానికి గురయ్యాను. అద్భుత ప్రయాణం ప్రారంభిస్తున్న కొత్త జంటకు నా ప్రేమ ఆశీస్సులు ఉంటాయి అని తెలిపారు. ఇది గతానికి వర్తమానానికి వారధిగా ఉండే ఆనందకరమైన క్షణం.. అని తెలియజేశారు. దీంతో ఇక్కడ గతానికి వర్తమానానికి ఆనందకరమైన క్షణం అనే లైన్ కూతురు నిహారిక గురించి పరోక్షంగా నాగబాబు ప్రస్తావించినట్లు సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

not even two days after varun tej got engaged look what nagababu did

Advertisement

నాగబాబుకి కూతురు నిహారిక అంటే పంచప్రాణాలు. ఈ క్రమంలో ఆమె గురించి నిశ్చితార్థం అయ్యి రెండు రోజులు కూడా కాకముందే భావోద్వేగం అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వీరిద్దరి వివాహం ఈ ఏడాది చివరిలో రాజస్థాన్ జైపూర్ లో భారీ ప్యాలస్ లో జరగనుందని సమాచారం.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి