now its time for prabhas varsham movie re release on his birthday
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అన్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసినా నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తేర్పడుతుంది. అయితే బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యాం రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. త్వరలో ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ రాబోతున్నాడు రీసెంట్ గా రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
ఇక ఇదిలాఉంటే ఇలాంటి టైం లోనే ప్రభాస్ మరో సినిమా హంగామాకి సిద్ధం అవుతుంది. ఈమధ్య స్టార్ సినిమాలన్ని రీ రిలీజ్ చేసి రికార్డులు కొడుతున్నారు. మహేష్ పోకిరి, పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఈమధ్యనే బాలయ్య బాబు చెన్నకేశవ రెడ్డి కూడా రీ రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చింది. ప్రభాస్ సూపర్ హిట్ సినిమాల్లో ఆల్ టైం ఫేవరెట్ మూవీ వర్షం. ఆ సినిమా 4కె వర్షన్ ని రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా వర్షం సినిమా రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
now its time for prabhas varsham movie re release on his birthday
శోభన్ డైరక్షన్ లో ప్రభాస్ త్రిష జంటగా నటించిన వర్షం సినిమా అప్పట్లో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ప్రభాస్ కి స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎం.ఎస్ రాజు ఈ మూవీ నిర్మించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. మరి రీ రిలీజ్ లో వర్షం సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ప్రభాస్ కి నేషనల్ వైడ్ ఉన్న ఫాలోయింగ్ కి ఈ సినిమా రీ రిలీజ్ అయితే రికార్డ్ కలక్షన్స్ సాధిస్తుందని చెప్పొచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇంతకన్నా గొప్ప పండుగ మరోటి ఉండదని చెప్పొచ్చు. అక్టోబర్ లో వర్షం మరో రెండు నెలల్లో అంటే జనవరి లో ఆదిపురుష్ ఇలా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామాతో థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని చెప్పొచ్చు.
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‌డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
This website uses cookies.