Nuvvu Nenu Prema 31 July Monday Highlights : నువ్వు నేను ప్రేమ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. నువ్వు నేను ప్రేమ 31 జులై 2023, సోమవారం ఎపిసోడ్ 376 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన కూతురు అనును తీసుకెళ్లేందుకు భక్త.. వస్తాడు. కానీ.. పద్మావతి మాత్రం తనను కూడా తీసుకెళ్లేందుకు తన నాన్న వచ్చాడని మురిసిపోతుంది. వెళ్లి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. కానీ.. భక్త మాత్రం అనును ఒక్కదాన్నే తీసుకెళ్తా అని చెబుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.
ఎందుకు పద్మావతిని తీసుకెళ్లవు అని అరవింద అడుగుతుంది. దీంతో పద్మావతిని ఎంతో ప్రేమించానని.. కానీ నా పరువును గంగలో కలిపిందని ఇక నుంచి తను నా కూతురే కాదని స్పష్టం చేస్తాడు భక్త. దీంతో అందరూ షాక్ అవుతారు. అను కూడా పద్మావతిని తీసుకొని వెళ్దాం అంటుంది కానీ.. భక్త అస్సలు వినడు. తన చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్తాడు. ఇంతలో అక్కడికి బ్యాగుతో పద్మావతి వస్తుంది. కానీ.. భక్త, అను కనిపించరు. నాన్న ఎక్కడికి వెళ్లావు అని పిలుస్తుంది. ఫోన్ మాట్లాడటానికి వెళ్లాడేమో అని అనుకుంటుంది పద్మావతి. అనును కూడా పిలుస్తుంది. కానీ.. మీ నాన్న అనును తీసుకొని వెళ్లిపోయాడు అని వాళ్లు చెప్పడంతో షాక్ అవుతుంది. మా నాన్న అలా చేయడు అని అంటుంది. వెంటనే బయటికి పరిగెత్తుతుంది.
పద్మావతి బయటికి వెళ్లగానే అనును ఆటోలో కూర్చోబెడతాడు భక్త. నాన్న ఆగండి అన్నా కూడా అస్సలు ఆగరు. పద్మావతి వైపు కూడా చూడడు భక్త. అలాగే ఆటో వెనుక చాలాసేపు పరుగెడుతుంది పద్మావతి. కానీ.. ఆటో మాత్రం ఆగదు. దీంతో ఏం చేయాలో తెలియదు పద్మావతికి. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది.
తన నాన్నతో ఉన్న రోజులను గుర్తు చేసుకుంటుంది పద్మావతి. మరోవైపు లక్ష్మీ ఇంటికి వెళ్లి అను కోసం వంట రెడీ చేస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు అను వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది లక్ష్మీ. ఇంతలో ఆటో వచ్చి ఆగుతుంది. అను ఒక్కతే రావడం చూసి పద్మావతి ఏది అని అడుగుతుంది లక్ష్మీ.
కానీ.. ఏం మాట్లాడదు అను. తర్వాత అత్తతో మాట్లాడుతుంది అను. పద్మావతి ఏది అని మళ్లీ అడుగుతుంది లక్ష్మీ. బావ గారు అని భక్తను అడిగినా కూడా ఏం మాట్లాడడు. లక్ష్మీ.. అను ఒక్కతే నా కూతురు అని అంటారు. నీ అక్క ఊరెళ్లింది కాబట్టి తను చేయాల్సిన పనులు నువ్వు చేయడానికి వచ్చావు. అంతవరకే చూసుకో. అనును చూసుకొని తనకు కావాల్సినవి రెడీ చేయి అంటాడు.
నా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టిన వాళ్లే నా బిడ్డలు అంటాడు భక్త. కట్ చేస్తే పద్మావతికి కోపం వచ్చి ఇంట్లోని సామాన్లు అన్నీ కింద పడేస్తుంది. నీకు పిచ్చి పట్టిందా అంటాడు విక్రమ్. కారణం చెప్పకుండా మీరు నన్ను పెళ్లి చేసుకున్నందుకు నిజంగానే పిచ్చి పట్టినట్టు ఉంది అంటుంది పద్మావతి. నీకు ఒక్కదానికేనా బాధ. నాకు లేదా అంటాడు విక్కీ.
అసలు బాధంటే నాది. ప్రేమించాను. ప్రాణం పెట్టాను కానీ నువ్వేం చేశావు అంటాడు విక్కీ. నమ్మకద్రోహం చేశావు. మోసం చేశావు అంటాడు. ఇవన్నీ అరవింద భర్త పక్కనే ఉండి వింటాడు. వెంటనే అరవిందను పిలుస్తాడు. దీంతో అరవింద, ఆమె భర్త ఇద్దరూ అక్కడికి వస్తారు.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.