Home » Entertainment » Omkar Appearing In Bigg Boss Ott Telugu House
Entertainment

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో ప్ర‌త్య‌క్షం అయిన ఓంకార్… ర‌చ్చ మాములుగా లేదుగా..!

Authored By
Sam C
The Telugu News | Updated on: March 19, 2022 8:59 pm
Advertisement

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్న విష‌యం తెలిసిందే. 17 మందితో మొద‌లైన ఈ షో నుండి ఇద్ద‌రు ఎలిమినేట్ కాగా, ప్ర‌స్తుతం హౌజ్‌లో 15 మంది ఉన్నారు. వీరంద‌రు తెగ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. అయితే హోలీ సంద‌ర్భంగా నిర్వాహ‌కులు స‌రికొత్త‌గా ప్లాన్ చేశారు. ఆనందాలను పంచే రంగుల హోలీ అంటే చిన్నవాళ్ల దగ్గరనుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమే. రంగులు పూసుకుంటూ, నీళ్లు చల్లుకుంటూ అనుంబంధాలను మరింత ధృడంగా మార్చుకుంటారు. ఇలాంటి హోలీ పండగను జరుపుకునే అవకాశం కంటెస్టెంట్లకు కల్పించాడు బిగ్‌బాస్‌. ఈ హోలీ వేడుకల్లో అమ్మాయిలను ఇంప్రెస్‌ చేయాలనే టాస్క్‌ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

Advertisement

అజయ్ మరోసారి బిందు మాధవిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. ఎంతమంది పులిహోర రాజలు పులిహోర కలపాలని ట్రై చేసినా కూడా వాడి లోపల ఉన్న ఇంటెన్షన్ ను చూసి వాడిని నువాబు అంతే దూరం పెడతావు అని చెప్పాడు. ఇక ఇప్పుడు కూడా కలర్ పుద్దామని అనుకుంటే. కలర్ ఇంకా ఏ కలర్ అవసరం లేదని అనిపిస్తోందని అజయ్ డైలాగ్ కొట్టేశాడు. అంద‌రు తెగ రచ్చ చేస్తున్న స‌మయంలో సడన్ గా ఓంకార్ అన్నయ్య కూడా పంజా సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ అందరితో తనకు నచ్చినట్లు ప్రత్యేకంగా స్కిట్స్ కూడా వేయించి మధ్యలో పంచ్ లు వేసే ప్రయత్నం చేశాడు. మిమ్మల్ని మీట్ అవ్వాలని చాలా ఎగ్జైట్ అయ్యి వచ్చాను అని ఓంకార్ చెప్పాడు.

Omkar appearing in Bigg Boss ott Telugu House

Advertisement

Bigg Boss OTT Telugu : ఓంకార్ అన్న‌య్య అద‌ర‌గొట్టాడు…

ఎపిసోడ్‌లో హామీదా అఖిల్ రొమాంటిక్ ట్రాక్ కూడా హైలెట్ గా నిలిచింది. ఇక్కడ ఉన్న లైట్స్ కుడా అవసరం లేదు నీ వెలుగు చాలు అని డైలాగ్ వదిలాడు. అంతే కాకుండా అందరూ మూన్ వైవు చూస్తుంటే నేను హామీదా వైపే చూస్తున్నాను అన్నాడు. ఇక అందుకు ఓంకార్ కూడా ఫిదా అవ్వగా హామీదా అఖిల్ కు చేయి ఇచ్చేసింది. ఇక చేయి ఇచ్చేసింది అంటూ అఖిల్ చెప్పగా.. అందుకు ఓంకార్ నువ్వు అడిగితే ఏదైనా ఇచ్చేసారు.. చెయ్యగా ఇప్పుడు ఇచ్చేసింది కౌంటర్ ఇచ్చాడు. మొత్తానికి ఓంకార్ ఎంట్రీతో ఈ ఎపిసోడ్ మాంచి కిక్ ఇస్తుంద‌ని అంటున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి