Home » Entertainment » On That Aspect Samantha And Naga Chaitanya Are Same
Entertainment

Samantha – Naga Chaitanya : సమంత నాగ చైతన్య విడిపోయారు కానీ ‘ఈ ఒక్క కారణం’ చాలు మళ్ళీ కలవడానికి..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: May 29, 2023, 11:00 am
Advertisement

Samantha – Naga Chaitanya : సమంత, నాగచైతన్య విడాకులు తీసుకొని చాలా రోజులు అయింది. అయినా కూడా ఇంకా వాళ్ల విడాకుల విషయమే సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండ్ అవుతూ ఉంది. నిజానికి.. సమంత స్టార్ హీరోయిన్. అందుకే.. తన వ్యక్తిగత జీవితం గురించి అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక.. నాగ చైతన్య అక్కినేని వారసుడు. టాలీవుడ్ లో హీరో. అందుకే ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా చాలామంది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

Advertisement

on that aspect samantha and naga chaitanya are same

సోషల్ మీడియాలో వీళ్ల గురించే చర్చిస్తుంటారు. అసలు వీళ్లు ఎందుకు విడిపోయారు అనేది పక్కన పెడితే.. వీళ్లు విడాకులు తీసుకున్నా వీళ్ల ఆలోచన విధానం, మనస్తత్వం మాత్రం ఒకేలా ఉంది అంటున్నారు. వాళ్లు విడిపోయినా కూడా నాగచైతన్య విలువలను, ఇష్టాలను సమంత గౌరవిస్తోందట. సమంత ఇష్టాలను నాగచైతన్య గౌరవిస్తున్నారట. వాళ్లిద్దరూ విడిపోయినా.. చైతూ ఎలా ఉండాలని సమంత కోరుకుందో అలాగే చైతన్య ఇప్పటికీ ఇంట్లో ఉంటున్నాడట.

Advertisement

Samantha – Naga Chaitanya : టాటూ కూడా చెరిపేసుకోలేదు

అందుకే కావచ్చు.. వాళ్లిద్దరూ వేయించుకున్న టాటూను కూడా చెరిపేసుకోలేదు. ఇద్దరి టాటూలు అలాగే ఉన్నాయి. వాళ్ల తీపి గుర్తులు కూడా అలాగే వాళ్ల దగ్గరే ఉన్నాయట. ఎవరివి వాళ్లు తీసుకోలేదట. నాగచైతన్యకి చెందిన వస్తువులు ఇంకా సమంత దగ్గర ఉన్నాయట. సమంతకు చెందిన వస్తువులు కొన్ని నాగచైతన్య దగ్గర ఉన్నాయట. అంటే.. వాళ్లు పెళ్లి కాకముందు ఎలా ఉండేవారో.. పెళ్లి అయ్యాక కూడా అలాగే ఉన్నారు. ఆ తర్వాత అంటే విడాకుల తర్వాత కూడా అలాగే ఉన్నారు అంటూ నెటిజన్లు వాళ్లను తెగ మెచ్చుకుంటున్నారు. అవును.. ఇదే కదా నిజమైన ప్రేమంటే అంటూ సోషల్ మీడియాలో మరోసారి వాళ్ల టాపిక్ ను ట్రెండ్ చేస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి