Home » Entertainment » Paata Uttej Detax From Social Media
Entertainment

Uttej : అందుకే సోషల్ మీడియాకు దూరంగా వెళ్తున్నా.. ఉత్తేజ్ కుమార్తె పోస్ట్ వైరల్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 22, 2022, 4:30 pm
Advertisement

Uttej : నటుడు, మాటల రచయిత ఉత్తేజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేదు. మెగా అభిమానిగా ఉత్తేజ్ అందరికీ సుపరిచితుడే. అయితే ఉత్తేజ్ నటనలో ఎమోషన్, కామెడీ ఇలా అన్నీ అలవోకగా పలికేస్తుంటాయి. ఉత్తేజ్‌కు ఇద్దరు కుమార్తెలే. వారు కూడా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో చిన్న కూతురు పాట ఉత్తేజ్ సోషల్ మీడియాలో ఎక్కువగా క్రేజ్ సంపాదించుకుంది.పాట ఉత్తేజ్ ఎక్కువగా తన అమ్మ గురించి చెబుతూ అందరినీ ఎమోషనల్‌‌గా టచ్ చేస్తుంటుంది.

Advertisement

గత ఏడాది హార్ట్ ఎటాక్‌తో ఉత్తేజ్ భార్య పద్మావతి మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాట ఉత్తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎమోషనల్ పోస్టు అందరినీ కంటతడి పెట్టించేసింది. అలా చనిపోయిన తన అమ్మ గురించి ఎప్పుడూ బాధపడుతూనే ఉంటుంది..తన అక్క చేతన కడుపులో మళ్లీ అమ్మ పుడుతుందని ఆశపడుతూ ఉంటుంది. అలా పాట ఉత్తేజ్ ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

Paata uttej detax from social media

Advertisement

తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతుంటుంది. అయితే ఇంతలా యాక్టివ్‌గా ఉండే పాట ఉత్తేజ్.. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట. దీనికంటూ ఓ కారణం ఉందని చెప్పుకొచ్చింది.పరీక్షలు దగ్గరకు వచ్చాయ్.. నేను చదువుకోవాల్సి ఉంది.. అందుకే కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతోన్నాను అంటూ పాట ఉత్తేజ్ అసలు విషయాన్ని చెప్పేసింది. అటు చదువులు, ఇటు సోషల్ మీడియాను రెండింటిని బ్యాలెన్స్ చేసేస్తోందన్న మాట.

Paata uttej detax from social media

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి