Home » Entertainment » Pan India Star Prabhas To Give Competition To Sharukh Khan
Entertainment

Prabhas : షారూఖ్ ఖాన్ కే ముచ్చెమటలు పట్టిస్తోన్న ప్రభాస్.. అరాచకం అంటే ఇదే

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: October 19, 2022, 10:30 am
Advertisement

Prabhas : ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. మామూలు స్టార్ కాదు.. ఆయన రేంజ్ ఇప్పుడు హాలీవుడ్. టాలీవుడ్, బాలీవుడ్ ను దాటి హాలీవుడ్ రేంజ్ కు వెళ్లింది ఆయన క్రేజ్. ఈ సంవత్సరం రాధేశ్యామ్ మూవీ డిజాస్టర్ అయినా కూడా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మరోవైపు ప్రభాస్ సినిమాలు ఏవీ ఈ సంవత్సరం విడుదల కావడం లేదు. కానీ.. వచ్చే సంవత్సరం ఏకంగా మూడు సినిమాలు ప్రభాస్ వి విడుదల కానున్నాయి. 2023 లో హాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే.. ప్రభాస్ మూడు సినిమాలతో పాటు..

Advertisement

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన మూడు సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. అంటే.. వచ్చే సంవత్సరం ఇద్దరు బిగ్ హీరోల మధ్య పెద్ద ఫైట్ జరగబోతోందన్నమాట. వచ్చే సంవత్సరం సంక్రాంతికి కానుకగా.. ప్రభాస్ ఆదిపురుష్ మూవీ విడుదల కానుంది. ఆ తర్వాత సలార్ మూవీ విడుదల కానుంది. ఆ తర్వాత చివరగా ప్రాజెక్ట్ కే విడుదల అవుతుంది. నిజానికి ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాపై భారీగా ట్రోలింగ్ నడుస్తున్నప్పటికీ.. ఈ సినిమాను సంక్రాంతికి కానుకగా విడుదల చేయనున్నారు.

pan india star prabhas to give competition to sharukh khan

Advertisement

Prabhas : జవాన్ వచ్చే జనవరిలో రిలీజ్

ఆ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చే సలార్ మూవీ సెప్టెంబర్ 28 న రిలీజ్ కానుంది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే 2023 ఏడాది చివర్లో విడుదల కానుంది. అంటే ముచ్చటగా ప్రభాస్ వి మూడు సినిమాలు వచ్చే సంవత్సరం విడుదల కానున్నాయి అన్నమాట. అలాగే.. షారుఖ్ ఖాన్ సినిమాల్లో జవాన్ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఆ తర్వాత రెండు సినిమాలు కూడా వచ్చే సంవత్సరమే విడుదల కానున్నాయి. ప్రభాస్ స్థాయి ఇప్పుడు హాలీవుడ్ కాబట్టి.. ప్రభాస్ తో బాలీవుడ్ కూడా పోటీ పడబోతుందన్నమాట. చూద్దాం మరి.. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో?

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి