Rajamouli : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇంతకాలం దర్శక ధీరుడు రాజమౌళి మాత్రమే పాన్ ఇండియన్ స్థాయిలో సినిమాలు తీయగలడని తెలుగు సినిమా సత్తా చాటగలడని అనుకున్నారు. రాజమౌళి కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకపోగా సినిమా సినిమాకి తన సత్తా ఏంటో నిరూపించుకుంటూ వచ్చాడు. తెలుగు చిత్ర స్థాయి ఇదీ అని బాహుబలి సినిమాలతో నిరూపించాడు. బాహుబలి బిగినింగ్, కన్‌క్లూజన్ తో ప్రపంచ దేశాలలో మన తెలుగు సినిమా రేంజ్ ఏంటో చూపించాడు. ఇలాంటి సినిమాలు కేవలం హాలీవుడ్ లోనే తీసే దర్శకులున్నారు అన్న వాళ్ళని బాహుబలి సినిమాలతో సమాధానం చెప్పాడు.
దాంతో రాజమౌళి అసలు బాహుబలి అని ..ఇలాంటి దర్శకుడు మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి ఇప్పట్లో రావడం కష్టం అని అందరీ అభిప్రాయపడ్డారు. కాని ఆ అభిప్రాయం తప్పు అని చెప్పడానికి ఎంతో కాలం పట్టలేదు. గమ్యం వంటి చిన్న సినిమా తీసిన క్రిష్ వెనక ఉన్న విషయం ఏ ఒక్కరు ఊహించలేకపోయారు. కంచె సినిమాతో కొంత వరకు రాజమౌళి రేంజ్ క్రిష్ కి ఉందన్న మాట వినిపించింది. ఎప్పుడైతే నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడో అప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో.. ప్రేక్షకులలో పూర్తిగా అర్థమైపోయింది.
ఇండస్ట్రీలో రాజమౌళి సత్తాని మించిన దర్శకులు ఉన్నారని. క్రిష్ బాలీవుడ్ లో మణికర్ణిక తీశాడు. ఈ రెండు సినిమాలతో రాజమౌళి తర్వాత క్రిష్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో తీస్తున్న హరిహర వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్ చూశాక ఖచ్చితంగా ఇండస్ట్రీకి బాహుబలి లాంటి దర్శకులు ఉన్నారని చెప్పుకోవడం మొదలు పెట్టారు. రాజమౌళి స్థాయి క్రిష్ కి కూడా ఉందని ప్రచారం మొదలైంది. ఒక్క క్రిష్ మాత్రమే కాదు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీ, రుద్రమదేవి సినిమా తీసిన గుణ శేఖర్ ఉండగా ఆలిస్ట్ లో నాగ్ అశ్విన్ కూడా చేరబోతున్నాడు. ఈ రకంగా చూస్తే ఇక రాజమౌళి కి గట్టి పోటీ మొదలైనట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
This website uses cookies.