Home » Entertainment » Pavitra Became Famous By Jabardasth
Entertainment

Jabardasth Pavithra: జబర్దస్త్ కామెడీ షో పవిత్ర గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు..ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

Authored By
vamana sai
The Telugu News | Published on: August 9, 2021, 11:30 am
Advertisement

Jabardasth Pavithra: బుల్లితెరపై అందరినీ అలరిస్తున్న ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్. ఒకప్పుడు ఈ షో గురించి విమర్శలు వెల్లువెత్తాయి. మగవాళ్ళు ఆడవాళ్లలా చీరలు జాకెట్లు తొడుక్కొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ కామెడీ చేయడం ఏంటీ..ఇది అసలు షోనేనా..దీని వల్ల ఎవరికీ ఉపయోగం..ఎవరిని ఉద్దరించడానికి అంటూ పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు, బయట ప్రేక్షకులు విమర్శించారు. ఏకంగా మల్లెమాల అదినేత, నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డిని, ఈ టీవి అధినేత రామోజి రావును ప్రశ్నించారు.

Advertisement

pavitra became famous by jabardasth

దాంతో స్కిట్ లో కొంత వల్గారిటీ తగ్గించి కొన్ని మార్పులు చేసి కొనసాగించారు. ఇప్పుడు ఈ షోకి దేశవ్యాప్తంగా విపరీతంగా పాపులారిటీ పెరిగింది. పొద్దంతా పనుల్లో బిజీగా ఉన్న వాళ్ళు కూడా సాయంత్రం అయ్యేసరికి ఈ షో మీద పడుతున్నారు. అంతేకాదు ఖాళీ సమయం దొరికితే మొబైల్స్ లో ట్యాబ్స్ లో రిపీటెడ్ గా ఈ ఎపిసోడ్స్ నే చూస్తున్నారు. ఇందులో పర్ఫార్మ్ చేసేవారికి, యాంకర్స్‌కి, జడ్జెస్‌కి భారీగా రెమ్యునరేషన్ కూడా ముట్టచెబుతున్నారు. ఇక ఇదే క్రమంలో ఈ మధ్య లేడీ పర్ఫార్మర్స్ కూడా జాయిన్ అవుతున్నారు.

Advertisement

Jabardasth Pavithra: ఈమె హైట్‌తోనే ఎక్కువగా పంచులతో కామెడీ పండిస్తున్నారు.

అలా వచ్చిన వారిలో ఇటీవల కాలంలో పవిత్ర బాగా పేరు తెచ్చుకుంటోంది. వర్షతో పాటు ఈ మధ్యే వచ్చిన ఆ అమ్మాయి జబర్దస్త్ కామెడీ షోలో తెగ హంగామా చేస్తుంది. చూడటానికి నాలుగు అడుగులే ఉంటుంది. కానీ ఈ అమ్మాయి వేసే పంచులు మాత్రం ఆరడుగుల బుల్లెట్స్ లా బాగా పేలుతున్నాయి. భాస్కర్, వెంకీ మంకీస్, హైపర్ ఆది.. ఇలా ప్రతీ టీమ్‌లోనూ పవిత్ర కనిపించి అలరిస్తోంది. సగం ఈమె హైట్‌తోనే ఎక్కువగా పంచులతో కామెడీ పండిస్తున్నారు. ఎక్కువగా రాఘవ స్కిట్‌లో చేసినపుడు నాగితో పవిత్ర చేసిన కామెడీ బాగా పేలింది. ఇది మాత్రమే కాదు.. చాలా వరకు స్కిట్స్‌లో పవిత్ర పంచులు బాగానే పేలుతున్నాయి.

Advertisement

దాంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ అసలు ఈ పవిత్ర ఎవరు.. ఎక్కడ్నుంచి వచ్చింది అని ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈమె చేసిన టిక్ టాక్ యూట్యూబ్ లో బాగా పాపులర్ అయి అక్కడి నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. అలా మెల్లగా జబర్దస్త్ టీమ్ లీడర్స్ ను కలిసి ఇక్కడ చోటు సంపాదించుకుందట. అంతకంటే ముందు కొన్ని సీరియల్స్ కూడా చేసింది పవిత్ర. కానీ ఆమెకి వాటితో రాని గుర్తింపు ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోతో వచ్చింది. ఇక పవిత్ర దూకుడు చూస్తుంటే చాలా రోజుల పాటు జబర్దస్త్‌లోనే సెటిలయ్యేలా ఉంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి