Home » Entertainment » Pawan Kalyan Mis These Block Buster Movies
Entertainment

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జన్మ మొత్తం బాధపడే న్యూస్ ఇది..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: February 26, 2023, 8:20 pm
Advertisement

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలంటే పని చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను చేసిన పవన్ కళ్యాణ్ కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నాడు. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ ఇడియట్ ‘ సినిమా ను మొదటగా పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కు వినిపించారు. అయితే పవన్ కళ్యాణ్ కొన్ని కారణాల వలన ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించలేదు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయినదో అందరికీ తెలిసిందే. అలా పవన్ కళ్యాణ్ ‘ ఇడియట్ ‘ సినిమాను మిస్ చేసుకున్నాడు.

Advertisement

Pawan kalyan mis these block buster movies

ఇక మరొక సినిమా మహేష్ బాబు హీరోగా నటించిన ‘ పోకిరి ‘ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటగా దర్శకుడు ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ కు వినిపించారు. అయితే ఈ సినిమాను కొన్ని కారణాల వలన పవన్ రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా కథను పూరి జగన్నాథ్ మహేష్ బాబుకు వినిపించారు. మహేష్ బాబుకు ఈ కథ నచ్చడంతో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘ అతడు ‘ సినిమా కథను మొదటగా పవన్ కళ్యాణ్ కు వినిపించారు.

Advertisement

Pawan kalyan mis these block buster movies

ఈ కథ నచ్చని పవన్ కళ్యాణ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. దాంతో త్రివిక్రమ్ ఇదే కథను మహేష్ బాబుకు వినిపించారు. మహేష్ బాబుకు ఈ సినిమా కథ నచ్చడంతో ‘ అతడు ‘ పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లోనే మోస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు నిరాశ వ్యక్తం పరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేసి ఉంటే బాగుండేది కదా అని ఫీల్ అవుతున్నారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు బ్లాక్ బస్టర్ సినిమాలను వదిలేసుకున్నవాళ్లే.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి