pawan kalyan pics on wedding card
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఆయన పేరు చెబితే అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారనే విషయం తెలిసిందే. ఆయన సినిమా విడుదల అవుతుందంటే నెల నుండే కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు. హిట్ , ఫ్లాపులతో సంబంధం లేకుండా అశేష ప్రేక్షకాదరణ పొందిన పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా రిలీజ్ సమయంలో అభిమానులు చేసిన సందడి మాములుగా లేదు. పాలాభిషేకాలు, రక్తాభిషేకాలు, డ్యాన్స్ లు ఇలా ఒకటేంటి రకరకాలుగా సందడి చేశారు. ఇలా పవన్‌పై తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తూ ఉంటారు.
తాజాగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జరజాం గ్రామానికి చెందిన హేమ సుందర రావు. తన పెళ్లి ఉన్న నేపథ్యంలో… వెడ్డింగ్ కార్డు పై పవన్ కళ్యాణ్ ఫోటోలతో నింపేసాడు . ఈనెల 4వ తారీఖున… హేమ సుందర రావు వివాహం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి పత్రిక పై పవన్ కళ్యాణ్ ఫోటోను ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అంతేకాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులంతా తన పెళ్లికి రావాలని విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలోను పలువురు అభిమానులు ఇలానే పెళ్లి కార్డ్‌పై పవన్ ఫొటోలు ముద్రించి అభిమానం చాటుకున్న విషయం తెలిసిందే.
pawan kalyan pics on wedding card
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న హరి హర వీరమల్లు ప్రస్తుతం షూటింగ్‌ను చివరి దశలో ఉంది. దీని తర్వాత హరిష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా పట్టాలెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. రీసెంట్‌గా విడుదలైన భీమ్లా నాయక్ చిత్రం ప్రస్తుతం కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ దూసుకుపోతుంది.
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.