Home » Entertainment » Pawan Kalyans In Sai Pallavi On New Movie
Entertainment

Sai Pallavi : పవన్ కళ్యాణ్‌తో రొమాన్స్‌కు సై అన్న సాయిపల్లవి.. ఫ్యాన్స్‌కు పండగే?

Authored By
mallesh
The Telugu News | Published on: October 8, 2022, 11:00 am
Advertisement

Sai Pallavi : తెలుగు సినిమా పరిశ్రమలో చాలా యాక్టివ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది సాయిపల్లవి అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. కేవలం నటనా పరంగానే కాకుండా డ్యాన్స్ చేయడంలోనూ సాయిపల్లవి తర్వాత ఎవరైనా అని చెబుతుంటారు. హీరోల్లో బన్నీ, చెర్రీ, తారక్ ఏవిధంగా డ్యాన్స్ లో కుమ్మేస్తారో.. హీరోయిన్ల విషయానికొస్తే సాయిపల్లవి డ్యాన్స్ అంటే అందరికీ ఇష్టం. హీరోయిన్ సాయిపల్లవి ఈ మధ్యకాలంలో నటించిన మూడు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి.

Advertisement

అందులో లవ్ స్టోరీ, విరాటపర్వం, గార్గి ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా తెగ నిరాశ పరిచాయి.ఈ క్రమంలో ఆమె దూకుడుకు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. మొన్నటివరకు వరుస సినిమాలతో జోరుమీదున్న సాయిపల్లవిజ.. తన సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. నేను నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. నా వల్ల నిర్మాతలు నష్టపోతున్నారు.

pawan kalyans in Sai Pallavi on New Movie

Advertisement

Sai Pallavi : సాయిపల్లవికి వరుస షాక్స్

వాళ్లు నన్ను నమ్మి నా సినిమాల కోసం ఇంత కష్టపడుతుంటే సరైన స్టోరీలు ఎంపిక చేసుకోకుండా ఏమరపాటుగా వ్యవహించినట్టు తన తప్పును అంగీకరించినట్టు జోరుగా కథనాలు వెలువడ్డాయి. తాజాగా సాయిపల్లవి అభిమానులు పండగ చేసుకునే రోజు వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ హరిహర వీరమల్లు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ ఎంపికవ్వగా.. సెకండ్ హీరోయిన్ గా సాయిపల్లవిని అనుకుంటున్నారట.. అదే నిజం అయితే అటు పవన్ ఫ్యాన్స్, ఇటు సాయిపల్లవి ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.వీరిద్దరి మధ్య ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని టాక్ వస్తోంది. అదే సినిమాకు హైలెట్ గా నిలవనుందట..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి