
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు సీరియల్ 10 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 406 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నవరాత్రి వేడుకలు బాగా జరుగుతున్నాయని జ్ఞానాంబ, గోవింద రాజు అనుకుంటుండగానే పీటర్, ఆయన భార్య అక్కడికి వస్తారు. వాళ్లను చూసి జ్ఞానాంబ షాక్ అవుతారు. రండి.. ఏంటి ఇంత సడెన్ గా వచ్చారు అని అడుగుతాడు గోవిందరాజు. దీంతో తన కూతురును బాధపెడుతున్నారని జ్ఞానాంబ మీద లేనిపోని మాటలు అంటారు పీటర్, ఆయన భార్య. అప్పుడే అక్కడికి రామా, జానకి, మల్లిక వస్తారు. నిన్న నేను ఫోన్ చేయడం వల్ల వీళ్లు వచ్చారా అని అనుకుంటుంది మల్లిక. నీ మాటలకు, నీ భార్య మాటలకు మేము కరిగిపోయాం అంటాడు పీటర్. కానీ.. మీ కుటుంబం మేడిపండు లాంటిదని.. పైకి నవ్వులే తప్ప లోపల నా కూతురు మీద కక్ష సాధిస్తున్నారు అని అర్థం అయింది అంటాడు పీటర్.
మనసులో ఏదో పెట్టుకొని మా జెస్సీని కష్టాలు పెడుతున్నారు కాబట్టి.. మాకు తెలిసింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం అంటుంది పీటర్ భార్య. ఇంతలో అక్కడికి వచ్చిన జెస్సీ.. తన తల్లిదండ్రులను తిడుతుంది. మీరు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా అంటూ సీరియస్ అవుతుంది. అసలు నేను ఇక్కడ అవస్థలు పడుతున్నానని మీకు ఎవరు చెప్పారు అని నిలదీస్తుంది జెస్సీ. నేను కోడలుగా వచ్చింది ఒక ఇంటికి కాదు.. దేవాలయానికి అని అంటుంది జెస్సీ. దేవత లాంటి అత్తయ్య గారి చల్లని నీడలోకి అంటుంది జెస్సీ. మామయ్య గారు, బావ గారు లాంటి గొప్ప మనసు ఉన్న ఇంట్లోకి అంటుంది జెస్సీ. ఎవరో చెప్పిన మాటలు విని ఇక్కడికి వచ్చి గొడవ చేయకండి అని చెబుతుంది జెస్సీ.
దీంతో చెప్పుడు మాటలు విని ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి అని జ్ఞానాంబకు క్షమాపణ చెప్పి పీటర్, ఆయన భార్య అక్కడి నుంచి వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిపోయాక.. తన తల్లిదండ్రుల తరుపున జ్ఞానాంబకు సారీ చెబుతుంది జెస్సీ.
చివరకు నేను పెట్టిన నిప్పు ఆరిపోయింది. నా ప్లాన్ బెడిసికొట్టింది అని మల్లిక తెగ బాధపడుతుంది. మల్లిక బాధపడటం చూసి అక్కడికి వెళ్లిన గోవిందరాజుకు మల్లిక మీద డౌట్ వస్తుంది. పీటర్ కు ఎవరు చెప్పుడు మాటలు చెప్పారో చెబితే అప్పుడు ఉంటుంది అసలు మజా అంటూ భయపెట్టిస్తాడు గోవిందరాజు.
మరోవైపు పరీక్షల కోసం కష్టపడి చదువుతూ ఉంటుంది జానకి. ఇంతలో అక్కడికి వస్తుంది జెస్సీ. అక్క నీతో మాట్లాడాలి అంటుంది. ఏమైంది అని అడుగుతుంది జానకి. దీంతో అఖిల్ తనను అస్సలు పట్టించుకోవడం లేదని చెబుతుంది జెస్సీ. జీవితాంతం అఖిల్ తో కలిసి ఉండాలి కదా అంటుంది.
నువ్వేం భయపడకు. ఆమె పద్ధతులకు తగ్గట్టుగా ఉంటే చాలు అని అంటుంది. అత్తయ్య గారితో ఇలాగే ఉంటే త్వరలోనే ఆమె నిన్ను దగ్గర తీస్తారు. అఖిల్ కూడా బాధ్యత త్వరగా తెలుసుకుంటాడు. నువ్వేం టెన్షన్ పడకు అని ధైర్యం చెబుతుంది జానకి.
నేను పెరిగిన వాతావరణం వల్ల నాకు ఈ పూజలు, పండుగల గురించి అస్సలు ఏం తెలియదు. ఏం చేయాలో, ఎలా చేయాలో చెబితే నేను నేర్చుకొని చేస్తా.. నాకు చెప్పు అక్క అంటుంది జెస్సీ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.