Home » Entertainment » Pinky Manikantha Comments In Bb Jodi Season 2 Telugu
Entertainment

BB jodi season 2 telugu : బీబీ జోడీ 2 .. ఆ ముగ్గుర్ని ఇంప్రెస్ చేయడం అంతా ఈజీ కాదు : పింకీ–మణికంఠ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్

Authored By
Suma
The Telugu News | Updated on: February 3, 2026 12:59 pm
Advertisement

BB jodi season 2 telugu :  బిగ్‌బాస్ సీజన్ 9 ముగిసిన వెంటనే అదే టైమ్‌స్లాట్‌లో ప్రారంభమైన బీబీ జోడీ 2  BB jodi  2 రోజురోజుకీ ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. ఇప్పటికే బిగ్‌బాస్‌లో ఫేమ్ సంపాదించిన మాజీ కంటెస్టెంట్లు జోడీలుగా మారి డాన్స్ షోలో పాల్గొనడం వల్ల ఈ కార్యక్రమంపై అంచనాలు భారీగా పెరిగాయి. డాన్స్‌తో పాటు ఎమోషన్స్, బాండింగ్, పోరాటం అన్నీ కలిసివస్తుండటంతో షోకు మంచి టీఆర్‌పీ వస్తోంది. శేఖర్ మాస్టర్, సదా, శ్రీదేవి విజయ్‌కుమార్ వంటి అనుభవజ్ఞులు జడ్జీలుగా ఉండటం షోకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలో తాజాగా పింకీ, మణికంఠ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

BB jodi season 2 telugu : బీబీ జోడీ 2 .. ఆ ముగ్గుర్ని ఇంప్రెస్ చేయడం అంతా ఈజీ కాదు : పింకీ–మణికంఠ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్

BB Jodi : పింకీపై మణికంఠ ప్రశంసలు.. జోడీ మధ్య స్ట్రాంగ్ బాండింగ్

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణికంఠ  manikanta  తన జోడీ పింకీ  Pinky  పై ఓపెన్‌గా ప్రశంసలు కురిపించాడు. “పింకీ చాలా టాలెంటెడ్. ఒక్కసారి స్టెప్ చూపిస్తే వెంటనే క్యాచ్ చేసి డాన్స్ చేస్తుంది” అంటూ ఆమె స్కిల్స్‌ను మెచ్చుకున్నాడు. తాను మాత్రం స్లో లెర్నర్‌నని అందుకే ఎక్కువగా బయట ప్రాక్టీస్ చేయాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. పోటీ సమయంలో ఇద్దరం ఒకరినొకరు బాగా సపోర్ట్ చేసుకుంటామని ముఖ్యంగా పింకీ తనకు చాలా హెల్ప్ చేస్తుందని సరదాగా వివరించాడు. ఈ మాటలతో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

Advertisement

BB Jodi : హెల్త్ ఇష్యూస్ ఉన్నా వెనక్కి తగ్గని పింకీ

ఇక పింకీ తన అనుభవాలను పంచుకుంటూ కొద్దిగా ఎమోషనల్ అయింది. ఇటీవల తనకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయని గతంలా గంటల తరబడి ప్రాక్టీస్ చేయలేకపోతున్నానని వెల్లడించింది. అయినప్పటికీ ఉన్న సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకుని 100 శాతం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పింది. ఈ నిజాయితీ మాటలు ఆమెపై అభిమానాన్ని మరింత పెంచాయి. హెల్త్ సమస్యలున్నా కూడా షోలో బెస్ట్ ఇవ్వాలనే ఆమె తపన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

BB Jodi : జడ్జీల సపోర్ట్, కథాకళి పెర్ఫార్మెన్స్ వెనుక అసలు కథ

యాంకర్ జడ్జీల సపోర్ట్ గురించి అడగగా పింకీ చాలా పాజిటివ్‌గా స్పందించింది. “శేఖర్ మాస్టర్, సదా మేడం, శ్రీదేవి మేడం ముగ్గురూ ఎంతో అనుభవం ఉన్నవారు. వాళ్లను ఇంప్రెస్ చేయడం అంత ఈజీ కాదు. కానీ మన కష్టం వాళ్లకు బాగా అర్థమవుతుంది” అంటూ చెప్పింది. తాము డాన్సర్లు కాకపోయినా గౌరవంగా ప్రోత్సాహకరంగా ట్రీట్ చేస్తున్నారని తెలిపింది. మణికంఠ కూడా జడ్జీల తీరు గురించి మాట్లాడుతూ.. డాన్స్ వచ్చినవాళ్లను ఒకలా రానివాళ్లను మరోలా గైడ్ చేయడం వాళ్లకు బాగా తెలుసని అన్నాడు. అదే సమయంలో కథాకళి పెర్ఫార్మెన్స్ మధ్యలో ఆగిపోయిన విషయం గురించి కూడా ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. అది మిడ్నైట్ షూట్ కావడంతో పాటు తాను తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నానని పింకీ తెలిపింది. దాదాపు 15–20 కిలోల బరువున్న కాస్ట్యూమ్స్ ధరించడంతో పాటు తినకుండా డాన్స్ చేయడం వల్ల చివరి క్షణంలో ఆగిపోవాల్సి వచ్చిందని చెప్పింది. ఈ అన్ని విషయాలు ఇప్పుడు షోపై ఆసక్తిని మరింత పెంచుతూ బీబీ జోడీ 2ను టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారుస్తున్నాయి.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి