Home » Entertainment » Pooja Hegde Decrease The Remuneration
Entertainment

Pooja Hegde : వాడి వల్లే పూజా హెగ్డే కెరీర్ ఇలా అయిపొయింది..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: February 16, 2023, 9:00 pm
Advertisement

Pooja Hegde : టాలీవుడ్ లో ‘ ముకుంద ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఈ సినిమా యావరేజ్ టాక్ ని సంపాదించుకున్నప్పటికీ ఆమెకు అంతగా క్రేజ్ రాలేదు. ఇక ఈ సినిమా తర్వాత ఆమెకు వరుసగా ప్లాపులు పడ్డాయి. దీంతో ఐరన్ లెగ్ ట్యాగ్ ను తగిలించారు. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్ళింది. అక్కడ హృతిక్ రోషన్తో కలిసి మొహంజోదారో సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో అమ్మడు ను ఐరన్ లెగ్ అని విపరీతంగా ట్రోల్స్ చేశారు. అందం, నటన, అభినయం ఉన్నప్పటికీ ఆమె సినిమాలు సక్సెస్ కాలేదు

Advertisement

Pooja Hegde decrease the remuneration

అయితే తెలుగులో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవరెడ్డితో సినిమా పూజకు స్టార్ డంను సంపాదించి పెట్టింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె వెను తిరిగి చూసుకోలేదు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. అల వైకుంఠపురం లో సినిమాతో ఆమెకు ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. ఈ సినిమాతో బుట్ట బొమ్మగా మారిన పూజా హెగ్డే అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది ఈ క్రమంలోనే తన రెమ్యునరేషన్ కూడా పెంచుకుంటూ పోయింది. అయితే తన బ్యాడ్ లక్ మళ్ళీ తన కెరీర్ వెనక్కి వెళ్ళింది.

Advertisement

Pooja Hegde decrease the remuneration

రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో అమ్మడు కెరీర్ మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో మహేష్ బాబు సినిమా తప్ప ఏ ప్రాజెక్టులు లేవు. సినిమా అవకాశాలు లేకపోవడంతో రెమ్యునరేషన్ తగ్గించుకుంటుందట. సినిమా హిట్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, ఫ్లాప్స్ పడ్డాక రెమ్యునరేషన్ విషయంలో మొండిగా ఉంటే అవకాశాలు రావని తన రెమ్యునరేషన్ ను తగ్గించుకుంది. మరి ఇకనైనా దర్శకనిర్మాతలు పూజ హెగ్డే కు సినౌ అవకాశాలు ఇస్తారేమో చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి