Home » Entertainment » Pooja Hegde Dont Have Movie Chances
Entertainment

Pooja Hegde : పూజా హెగ్డేకు ఇంత త్వరగా ఈ పరిస్థితి వస్తుందనుకోలేదు

Authored By
Himanshi
The Telugu News | Updated on: January 27, 2022, 10:44 pm
Advertisement

Pooja Hegde : ముకుందా.. ఒక లైలా కోసం సినిమాలతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు తెలుగు లో ఆ రెండు సినిమాలతో పెద్దగా స్టార్‌ డమ్‌ అయితే దక్కించుకోలేక పోయింది. ఆ రెండు సినిమాలు చేసిన వెంటనే బాలీవుడ్‌ లో మెహెంజదారో సినిమా లో నటించేందుకు గాను ముంబయి చెక్కేసింది. హృతిక్ రోషన్ తో ఆ సినిమాలో పూజా హెగ్డే నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి ఉంటే తెలుగు లో ఈ అమ్మడిని మళ్లీ చూడక పోయేవాళ్లం. కాని ఆ సినిమా నిరాశ పర్చడంతో మళ్లీ రెండేళ్ల తర్వాత డీజే సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది. మొదటి రెండు సినిమాలకు డీజేకు పూర్తి విరుద్దంగా కనిపించింది.అల్లు అర్జున్‌.. హరీష్‌ శంకర్ ల కాంబోలో వచ్చిన డీజే సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

Advertisement

ఆ సినిమాలో ముద్దుగుమ్మ పూజా హెగ్డే అందాల వింధుకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యారు. ఆ సినిమా లో పూజా హెగ్డే అందాల వింధు మరియు నటన కు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఫిదా అయ్యి ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్ ఇమేజ్ ను కట్టబెట్టారు. స్టార్‌ హీరోల నుండి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆమె మోస్ట్‌ వాంటెడ్‌ గా మారిపోయింది. నెట్టింట ఆమె కు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగి పోయింది. ఒకానొక సమయంలో స్టార్‌ హీరోలకు కూడా డేట్లు లేవు అంటూ చెప్పే పరిస్థితి వచ్చింది. తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం మరియు హిందీలో కూడా ఈ అమ్మడు సినిమాలు చేస్తూ బిజీగా నిలిచింది.పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్‌ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. మరో వైపు సల్మాన్ ఖాన్ తో నటించాల్సిన ఒక సినిమా కరోనా వల్ల క్యాన్సిల్‌ అయ్యింది. ఇక తమిళంలో విజయ్ తో కలిసి ఒక సినిమాను చేస్తోంది.

Pooja hegde don’t have movie chances

Advertisement

Pooja Hegde : అవకాశాలు లేక పూజా హెగ్డే ఎదురు చూపులు..

ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. షూటింగ్ పూర్తి అయిన వెంటనే విడుదల చేసేందుకు విజయ్ బీస్ట్‌ యూనిట్‌ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో పూజా హెగ్డే హీరోయిన్‌ గా తమిళంలో ఆఫర్లు ఏమీ రావడం లేదు. తెలుగు లో రాధేశ్యామ్‌ వచ్చే వరకు కొత్త సినిమాలు ఏమీ కూడా ఈమెకు దక్కే ఛాన్స్ కనిపించడం లేదు. ఇక బాలీవుడ్‌ లో అడపా దడపా సినిమాలు చేస్తున్నా కూడా అక్కడ ఈమెకు స్టార్‌ గా గుర్తింపు దక్కే అవకాశం లేదు. పూజా హెగ్డే ఒక్కసారిగా ఖాళీ అవ్వడం అందరికి ఆశ్చర్యంగా ఉంది. స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్ గా నిలిచిన ఈ అమ్మడు అవకాశాలు లేక ఢీలా పడటం విడ్డూరంగా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ ఈ అమ్మడు పుంజుకుంటుందా లేదంటే రకుల్‌ ప్రీత్‌ సింగ్ లా అవకాశాలు లేక కెరీర్‌ ను ముగించే అవకాశం ఉందా అనేది చూడాలి.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి