Home » Entertainment » Pooja Hegde Thats A Share Of Remuneration Benefits
Entertainment

Pooja Hegde : అది రెమ్యునరేషనా పూజా హెగ్డే .. లాభాలలో వాటానా..?

Authored By
vamana sai
The Telugu News | Updated on: June 8, 2022 1:22 am
Advertisement

Pooja Hegde : టాలీవుడ్, బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే రెమ్యునరేషన్ చూస్తే కామన్ పీపుల్‌కు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయట. సోషల్ మీడియాలో నెటిజన్స్ ఇప్పుడు ఇదే మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, అమ్మడికి ఇస్తుంది రెమ్యునరేషనా లేక లాభాలలో వాటానా..! అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకొచ్చిందీ అంటే కొత్తగా మొదలైన జనగణమన సినిమా వల్ల. ఇటీవల పూజా నటించిన సినిమాలు వరుసగా ఫ్లాపయ్యాయి. ఐటెం సాంగ్ చేసిన భారీ మల్టీస్టారర్ ఎఫ్ 3 కూడా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది.

Advertisement

అయినా పూజా వరుసగా సినిమాలకు సైన్ చేస్తోంది. మేకర్స్ తన క్రేజ్‌ను బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. ఈ నెలలోనే పూజా హీరోయిన్‌గా నటిస్తున్న ఓ భారీ హిందీ ప్రాజెక్ట్ అలాగే, పూరి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా జనగణమన షూటింగ్ మొదలయ్యాయి. విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమాను రూపొందుస్తున్న పూరి వెంటనే గ్యాప్ లేకుండా ఆర్మీ నేపథ్యంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమను మొదలిపెట్టారు. తాజా షెడ్యూల్ కశ్మీర్‌లో ప్రారంభించారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మాతలు.

Pooja Hegde That’s a share of remuneration benefits

Advertisement

Pooja Hegde: ఇంత రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తున్నట్టూ..?

పాన్ ఇండియన్ సినిమాగా తెలుగుతో హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఒకేసారి తెరకెక్కించి ఒకేసారి ప్రచంచ వ్యాప్తంగా వచ్చే ఏడాదిరిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల తేదీని కూడా పూరి టీమ్ కన్‌ఫర్మ్ చేసింది. అయితే, జనగణమన సినిమాలో నటిస్తున్నందుకు ఏకంగా
పూరి టీమ్ పూజాకు ఇస్తున్న రెమ్యునరేషన్ రూ. 4 కోట్లు అని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, తన స్టాఫ్ కోసం రూ 1 కోటి అదనంగా ముట్టచెబుతున్నారట. ఇంత రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తున్నట్టూ అంటే ఆమెకు పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ ఉండటమే అంటున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియదు గానీ, హాట్ టాపిక్‌గా మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి