Poonam Kaur : పూనమ్ కౌర్ సంచలన ట్వీట్.. ఆ ట్వీట్‌పై పవన్ ఫ్యాన్స్ ఏమంటారో..?
Poonam Kaur : టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. సినీ నటుడు, వైసీపీ మద్దతు దారు పోసాని కృష్ణమురళి జనసేనాని పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తున్న క్రమంలో పంజాబీ అమ్మాయికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఆ పంజాబీ అమ్మాయి పూనమ్ కౌరేనని కొందరు నెటిజన్లు ఆరోపించారు.ఇకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు మద్దతు తెలిపింది పూనమ్. ఈ క్రమంలోనే ఆయన అధ్యక్షుడిగా గెలిస్తే సంచలన విషయాలు బయటపెడతానని పేర్కొంది పూనమ్.
poonam kaur sensational tweet
కాగా గతంలోనూ దర్శకరత్న దాసరి నారాయణరావును ఉద్దేశించి పూనమ్ ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ చాలా భావోద్వేగంతో చేసినట్లు తెలిపింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏకైక గురువు దాసరి గారని, ఆయనను చాలా మిస్సవుతున్నానని తెలిపింది. దాసరి గారికి తానొక సందేశాన్ని తెలపాలని అనుకుంటున్నానని, దేవుడు దానిని ఆయనకు చేరవేస్తాడని ఆవిస్తున్నట్లు ఆమె చెప్పింది. కాగా, ఆ ట్వీట్ చాలా కాలం పాటు చర్చనీయాంశంగా ఉంది. ఇకపోతే తాజాగా ట్విట్టర్ వేదికగా ఆమె చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండవుతోంది. పీకే లవ్ హ్యాష్ ట్యాగ్‌తో పూనమ్ కౌర్ తన ఫొటోలు కొన్ని షేర్ చేసింది. సదరు ఫొటోల్లో పూనమ్ అందంగా ఉంది.
Poonam Kaur : పీకే లవ్ అంటూ.. సెన్సేషనల్ ట్వీట్
poonam kaur coments on posani
పంజాబీ డ్రెస్‌లో వైట్ కలర్ టాప్ ధరించి అందగా కనబడుతోంది. అయితే, ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమవుతోంది. పూనమ్ కౌర్ పీకే లవ్ అనే క్యాప్షన్ పెట్టడాన్ని బట్టి కొందరు నెటిజన్లు ద్వందర్థాలు తీస్తున్నారు. పీకే అంటే పూనమ్ కౌర్ అని కొందరు పేర్కొంటుండగా, మరి కొందరు పవన్ కల్యాణ్ అని అంటున్నారు. ఇకపోతే ఈ ట్వీట్ పట్ల జనసేనాని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి… పూనమ్ కౌర్ తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘నెక్స్ట్ ఏంటి’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత కొవిడ్ నేపథ్యంలో ఆమె నటించిన సినిమాలు విడుదల కాలేదు.
