
poonam kaur tweet topic in social media
Poonam Kaur : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. సోషల్ మీడియాలో భీమ్లా నాయక్ రచ్చ నడుస్తుంది. ఒరిజినల్ సినిమాతో పోలిక పెట్టాల్సిన అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని మార్చేశారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్, యాటిట్యూడ్, రానా స్వాగ్, తమన్ మ్యూజిక్ ఇలా అన్నీ కూడా దుమ్ముదులిపేశాయి. అయితే భీమ్లా నాయక్ సినిమా మీద పూనమ్ కౌర్ పరోక్షంగా కౌంటర్లు వేస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
పూనమ్ కౌర్ రీసెంట్‌గా… ”నేను మనస్ఫూర్తిగా ఆరాధించి, ప్రేమించి వ్యక్తులు ఈ పొలిటికల్ లీడర్స్ దగ్గర వాళ్ళకి వాళ్ళు తక్కువ చేసుకొని, చేతులు జోడించి, చేతులు కట్టుకొని ఉండండం నాకు చాలా బాధగా ఉంది. అవసరాల కోసం కష్టపడి తెచ్చుకున్న వ్యక్తిత్వం వదులుకోవడం మానేయాలి” అని ట్వీట్ చేశారు. వెంటనే డిలీట్ చేసింది. ఇక వర్మ చేసిన ట్వీట్‌కి రిప్లై ఇస్తూ.. ఇద్దరు దర్శకులు ఆడవాళ్లను ఆయుధాలులా వాడుకుంటున్నారని పేర్కొంది. ఇక తాజాగా వాట్సప్ చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిందిసినిమాకి వచ్చిన అక్కా.. బావ సినిమా.. ఉదయం 8 గంటలకు.. స్టార్ ఎమోజీలను రిప్లైగా ఇచ్చారు.
poonam kaur tweet topic in social media
ఇక వాటికి సిగ్గుపడుతున్నట్టుగా ఎమోజీలతో పాటు..నిజాయితీగా రివ్యూ చెప్పమని అడుగుతారు. సరే అక్కా అని అవతలి వ్యక్తి రిప్లై ఇస్తారు. అక్కా సినిమా హిట్.. ట్రస్ట్ మీ.. ప్రామీస్ చెబుతున్నా అని అవతలి వ్యక్తి రిప్లై ఇస్తారు. ఈ స్క్రీన్ షాట్‌ను పూనమ్ కౌర్ షేర్ చేయడంతో అసలు చర్చ మొదలైంది. ఇందులో అక్క, బావ, తమ్ముడు, ఈ బాగోతం ఎంటనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. అయితే ఏది ఎలా ఉన్నా భీమ్లా నాయక్ సినిమా మాస్ హిట్ కావడంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.