
poonam kaur Tweet viral
Poonam Kaur : టాలీవుడ్ భామ పూనమ్ కౌర్ తరచూ వివాదాల్లో ఉంటుంది. పూనమ్ కౌర్‌ను ఉద్దేశించి చాలా మంది పలు రకాలుగా కామెంట్స్ చేస్తుండగా, వాటికి ఎప్పటికప్పుడు సమాధానాలిచ్చే ప్రయత్నం చేస్తుంటుంది ఈ భామ. కాగా, ఈ భామ చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా చేసే ట్వీట్స్ సోషల్ మీడియాలో చాలా సార్లు చర్చనీయాంశంగా ఉంటాయి. గతంలో పలువురిని ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్స్‌పై నెటిజన్లు ఎప్పటికప్పుడు చర్చించుకుంటారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎలక్షన్స్ సందర్భంలో పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు కూడా అప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
poonam kaur Tweet viral
తాజాగా సమంత-నాగచైతన్య విడాకులపై పూనమ్ కౌర్ స్పందించింది. డైవోర్స్ అయినపుడు ఎప్పుడూ మహిళలపై పలు ఆరోపణలు చేస్తుంటారని, ఇందుకు క్లాసిక్ ఎగ్జాంపుల్ సమంతేనని పరోక్షంగా ట్వీట్‌లో పేర్కొంది పూనమ్. సమంత-నాగచైతన్య విడిపోయినపుడు అందరూ సమంతపైనే కామెంట్స్ చేశారని, నాగచైతన్యను మాత్రమే వదిలేశారని, డైవోర్స్ తీసుకున్నపుడు పురుషులకు బాధ ఉండదా అని పూనమ్ ప్రశ్నించింది. చాలా మంది సమంతపై దారుణమైన ఆరోపణలు చేశారని, ఆమెకు వివాహేతర సంబంధాలు అంటకట్టారని, ఆమె డబ్బు కోసమే ఇలా చేసిందని, సినిమా కెరీర్ కోసమే ఇలా చేసిందని పలు రకాలుగా ఆరోపించారని గుర్తు చేసింది పూనమ్. ఇలా జరుగుతున్నపుడు సమాజం పక్షపాతి ధోరణితో వ్యవహరించిందిని పేర్కొంది పూనమ్.
poonam kaur Tweet viral
పూనమ్ కౌర్ చేసిన ట్వీట్‌లో డైరెక్ట్‌గా సమంత పేరును కాని నాగచైతన్య పేరును కాని పూనమ్ వాడకపోవడం గమనార్హం. అయితే, పూనమ్ చేసిన కాంటెక్స్ట్‌ను పరిశీలిస్తే మాత్రం అది సమంత-నాగచైతన్యలకు సంబంధించినది అర్థమవుతున్నది. ఆడవాళ్లపై హింసించే ధోరణి పెరిగిపోతున్నదని, వారిపై ఎటువంటి కామెంట్స్ చేసిన ఏం కాదనే ధోరణి పెరిగిపోయిందని పూనమ్ కౌర్ ఆందోళన వ్యక్తం చేసింది. సమంత విషయంలో వచ్చిన పలు ఆరోపణలపై సమంత కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలకు సమంత కోర్టు మెట్లెక్కింది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.