
poonam kaur twist with childrens
Poonam Kaur : పూనమ్ కౌర్.. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ అందుకున్న పూనమ్.. ‘మాయాజాలం’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది.ఆ తర్వాత పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. సరైన అవకాశాలు లేక నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. రీసెంట్‌గా తన పాత్ర నచ్చడంతో తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. అరవింద్ కృష్ణ, సందేష్ బురి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నాతి చరామి చిత్రంలో కీలక పాత్ర పోషించింది. నాగు గవర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 10న విడుదల కాగా, ఇది ప్రేక్షకులని అంతగా అలరించలేకపోయింది.
పూనమ్‌కి కూడా పెద్దగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టలేకపోయింది.తాజాగా ఈ బ్యూటీ ఇద్దరు పిల్లలతో ఉన్న ఒక ఫోటోను షేర్ చేసింది. అంతేకాకుండా నా హ్యాపీనెస్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టుకొచ్చింది. ఇక దీంతో నెటిజన్లు ఆ పిల్లలు ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టేశారు. 35 ఏళ్ల పూనమ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ ఫోటో చూసిన వారందరు ఏంటి పూనమ్ కు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారా..? అనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్నీ ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదు అని మరికొందరు తమ అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం పూనమ్ కు పెళ్లి కాలేదు.. ఆ పిల్లలు వారి బంధువుల పిల్లలు అయ్యి ఉంటారని చెప్పుకొస్తున్నారు.ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.
poonam kaur twist with childrens
ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్‌లో పూనమ్ కౌర్..భావోద్వేగానికి గురైంది. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు రావడంతో తాను కన్నీళ్లు ఆపుకోలేక పోయానని తెలిపింది. తాను సినిమాలు వదిలేసి వెళ్లిపోవాలనుకున్నట్లు పేర్కొంది. ‘2017, 18లో నేను పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లిపోదామనుకున్నా. కానీ నా జీవితాన్ని మార్చేసింది సినిమానే. తర్వాత ఇక సినిమాలు చేయను. పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లిపోతానని మమ్మీకి చెప్పాను. దేశం వదిలి వెళ్లిపోతానని చెప్పా. కానీ చాలా క్లిష్టతరమైన పరిస్థితిలో రియలైజ్ అయ్యాను. దానివల్లే ఇక్కడ ఉన్నాను. పెళ్లి కలను కొందరు చెదరగొట్టారు. అయితే ఇండియన్ కల్చర్‌లోనే మహిళలు ఎలా ధైర్యంగా ఉండాలనేది, పోరాడలనేది ఉంది. దాన్నుంచే నేను స్ఫూర్తి పొందాను. ఈ విషయంలో అమ్మ ఎంతో సపోర్ట్ చేసింది.’ అని తెలిపింది పూనమ్.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.