Home » Entertainment » Poonam Pandey Comments On Ex Husband
Entertainment

Poonam Pandey : సామ్ బాంబేని పెళ్లాడాక ఏం జ‌రిగిందో చూశారు.. ఎవ‌రికి ఇలాంటి ప‌రిస్థితి రావొద్దు.

Authored By
Sam C
The Telugu News | Published on: February 25, 2022, 5:30 pm
Advertisement

Poonam Pandey : స‌న్నీ లియోన్ త‌ర్వాత ఆ రేంజ్‌లో అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తున్న అందాల ముద్దుగుమ్మ పూనమ్ పాండే. ఈ అమ్మ‌డు సామ్ బాంబేని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక అత‌నితో గొడ‌వ‌లు ప‌డుతూ వార్త‌ల‌లో నిలుస్తూ ఉండేది. ఇటీవ‌ల పూనమ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. సామ్‌బాంబే తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడుతుండటంపై ఇద్దరికి వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో కోపంతో ఊగిపోయిన సామ్‌ బాంబే..పూనమ్‌ను జుట్టు పట్టుకొని తలను గోడకు కొట్టాడు. విచక్షణరహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో పూనమ్‌ తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. 2020 సెప్టెంబర్‌1న పూనమ్‌-శామ్‌ బాంబే వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Advertisement

అయితే పెళ్లయిన కొద్ది రోజులకే శామ్‌ బాంబే.. పూనమ్‌పై చేయి చేసుకోవడంతో పాటు విచక్షణరహితంగా దాడి చేయడంతో ఆమె గృహహింస కేసు పెట్టింది.అనంతరం భర్త క్షమాపణలు చెప్పి రాజీకి దిగడంతో వివాదం సద్దుమణిగింది.పూనమ్‌ పాండే తాజాగా కంగనా రనౌత్‌ హోస్ట్‌గా వ్యవహరించనున్న సెన్సేషనల్‌ షో లాకప్‌లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూనమ్‌ వైవాహిక జీవితంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘పెళ్లి తర్వాత ఇన్ని ఇబ్బందులు రావడం నా దురదృష్టం. ఏ అమ్మాయికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు. నేను సామ్‌ బాంబేను పెళ్లాడాక ఏమైందో చూశారుగా. ఇది అనుకోకుండా జరిగిపోయింది. ప్రస్తుతం నేను సింగిల్‌గా ఉన్నాను. నాకిప్పుడు ఏ భాగస్వామి తోడు అవసరం లేదు’ అని చెప్పుకొచ్చింది.

poonam pandey comments on ex husband

Advertisement

Poonam Pandey  : పూన‌మ్ కామెంట్స్ వైర‌ల్..

నటి పూనమ్ పాండే ఇప్పుడు తన అండ్ గ్లామర్ ఇమేజ్ కాకుండా సీరియస్ పాత్రల కోసం వెతుకుతోంది. సినిమాల్లో అమ్మ-చెల్లెలు లాంటి క్యారెక్టర్స్ చేసి అభిమానులకు తన యాక్టింగ్ స్కిల్స్ చూపించాలని కోరుకుంటుంది. తన భవిష్యత్ ప్రణాళికలపై పూనమ్ మాట్లాడుతూ.. తాను పరిశ్రమలో గ్లామర్ డాల్‌గా పేరు తెచ్చుకున్నానని, అయితే ఇప్పుడు సీరియస్ పాత్రలు చేయడానికి ప్లాన్ చేస్తున్నానని చెప్పింది. సినిమాల్లో అమ్మగా కానీ, చెల్లిగా కానీ నటించడానికి తనకు అభ్యంతరం లేదని, తనకు అవకాశం వస్తే ఖచ్చితంగా ఆ పాత్రలు చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి