Poorna : వెక్కి వెక్కి ఏడ్చిన పూర్ణ, శ్రద్దా దాస్.. గుండెలు పిండేశారుగా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Poorna : వెక్కి వెక్కి ఏడ్చిన పూర్ణ, శ్రద్దా దాస్.. గుండెలు పిండేశారుగా

 Authored By prabhas | The Telugu News | Updated on :27 August 2022,11:20 am

Poorna : అమ్మ సెంటిమెంట్ ఎక్కడైనా వర్కవుట్ అవుతుంది. అమ్మ సెంటిమెంట్‌తో తీసిన చిత్రాలెన్నో బ్లాక్ బస్టర్‌గా నిలిచాయ. వందల కోట్లు తెచ్చిపెట్టాయ్. ఇక బుల్లితెరపైనా మదర్ సెంటిమెంట్‌తో తీసిన సీరియల్స్ ఎన్నో వర్కవుట్ అయ్యాయి. అలా మదర్ సెంటిమెంట్‌ అనేది అందరికీ కనెక్ట్ అవుతుంటుంది. ఇప్పుడు ఢీ షోలోనూ అదే ఫార్మూలాను వాడారు. పర్ఫామెన్స్ చేసేందుకు అమ్మ ప్రేమను అడ్డు పెట్టుకున్నారు. అమ్మ సెంటిమెంట్‌తో డ్యాన్స్ చేశారు. మామూలుగా అయితే ఢీ షో అనేది డ్యాన్స్ షో నుంచి కామెడీ షోగా రూపాంతరం చెందింది.

శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ అని ఇలా ఎప్పుడూ మారుతూనే ఉంటారు. ఇక లేడీ జడ్జ్‌లో ప్రియమణి, పూర్ణలు ఆ మధ్య తెగ సందడి చేశారు. ఇప్పుడు శ్రద్దా దాస్, పూర్ణలు వచ్చారు. మధ్యలో నందితా శ్వేతను కూడా పెట్టుకున్నారు. ఇక రవికృష్ణ నవ్యస్వామి, సుధీర్ రష్మీ జోడి కొంత కాలం సందడి చేశారు. ఇప్పుడు రెండు జోడీలు కనిపించడం లేదు. వెళ్లిపోయిన అఖిల్‌ను మళ్లీ పట్టుకొచ్చారు. ప్రదీప్ ఒక్కడే కంటిన్యూగా ఉన్నాడు. హైపర్ ఆది కూడా తన స్టైల్లో చేసుకుంటూ పోతోన్నాడు. ఆదికి తేజస్వీ అనే అమ్మాయిని తగిలింది.

Poorna and Shraddha Das gets cried in dhee show promo

Poorna and Shraddha Das gets cried in dhee show promo

వీరిద్దరి ట్రాక్ కూడా భరించలేనంత భారంగా తయారైంది. ఇక ఇలాంటి పిచ్చి ట్రాకుల మధ్య జిమ్నాస్టిక్స్ లాంటి డ్యాన్స్ మరింత తలనొప్పిగా మారుతుంటాయి. అప్పుడప్పుడు మాత్రం ఇలాంటి ఎమోషనల్ పర్ఫామెన్స్‌లు చేస్తుంటారు ఢీ కంటెస్టెంట్లు. తాజాగా ఆ పర్ఫామెన్స్‌ను చూసి అందరూ ఎమోషనల్ అయ్యాడు. గుండెలు పిండేసే ఆ ఎమోషనల్ పర్ఫామెన్స్‌ను చూసి పూర్ణ ఏకంగా స్టేజ్ మీదకు వచ్చేసి వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఇక శ్రద్దా దాస్ అయితే తన కంట్లోంచి కన్నీటిని ధారలా పొంగించింది. అందరూ ఎమోషనల్ అయిన ఈ పర్ఫామెన్స్ వచ్చే వారం బుల్లితెరపైకి రానుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి