Home » Entertainment » Poorna Husband Give A Gift For Her
Entertainment

Poorna Husband : పెళ్లి జరుగుతూ ఉండగా భార్యకి ‘ఆ గిఫ్ట్’ ఇచ్చిన పూర్ణ భర్త… ఫ్యూజ్ ఎగిరిపోయింది ఆ అమ్మాయికి!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: October 26, 2022, 10:40 am
Advertisement

Poorna Husband : హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు పరిశ్రమలోకి సీమటపాకాయ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో హీరోగా అల్లరి నరేష్ నటించాడు. ఈ సినిమా మరి అంత సూపర్ డూపర్ కాకపోయినా యావరేజ్ గా ఆడింది. ఈ సినిమా తర్వాత పూర్ణకు అవును సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా అవును 2 సినిమా కూడా వచ్చి మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాతి సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో కొన్నాళ్లకు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది పూర్ణ. ఆ తర్వాత ఢీ షోలో జడ్జిగా వ్యవహరించింది. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు సోషల్ మీడియాలో పాపులర్ అయింది.

Advertisement

ఢీ షో ద్వారా ఆమెకు వచ్చిన పాపులారిటీతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి అవకాశాలను అందుకుంటుంది. అదే టైంలో పెళ్లి చేసుకోని లైఫ్ లో కూడా సెటిల్ అయిపోయింది. నిజానికి తన పెళ్లి ఫిక్స్ అయిందని పూర్ణ ఎప్పుడో చెప్పింది. నిశ్చితార్థం అయిందా అని కూడా చెప్పింది. కానీ పెళ్లి గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే రీసెంట్ గా పూర్ణ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిజానికి పూర్ణకి ఎప్పుడో పెళ్లి అయిపోయిందట. కొన్ని కారణాల వలన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే పెళ్లి చేసుకున్నామని త్వరలోనే ఫ్రెండ్స్ కు కేరళలో బిగ్ పార్టీ ఇస్తామని చెప్పింది.

Poorna husband give a gift for her

Advertisement

అయితే దీపావళి సందర్భంగా పూర్ణ తన భర్తతో దిగిన మ్యారేజ్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ క్రమంలో ఆమె పెళ్లికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే పూర్ణకు తన భర్త దాదాపు 1700 గ్రాముల బంగారం గిఫ్ట్ గా ఇచ్చారట. అంతేకాదు తనకోసం ఏకంగా ఒక లగ్జరీ హౌస్ ని తన పేరు మీద మ్యారేజ్ గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తుంది. పూర్ణ భర్త ఎవరో కాదు దుబాయ్ బెస్ట్ ఇండియన్ వ్యాపారవేత్త షానిద్ ఆసిస్ అలీ. ఇతని పేరు మన స్టార్ సెలబ్రిటీస్ అందరికీ తెలిసు. అయితే తాజాగా పెళ్లి ఫోటోలు చూసిన అందరూ పూర్ణ చక్కగా బాపు బొమ్మలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి