Home » Entertainment » Poorna Ks Nainika In Dhee Show
Entertainment

Poorna : ఢీ షోలో ముద్దుల సంప్రదాయం.. కంటెస్టెంట్ బుగ్గ కొరికిన పూర్ణ

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: September 17, 2021 8:47 pm
Advertisement

బుల్లితెరపై ఢీ షోకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ వేరే లెవెల్. ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభుదేవా వంటి స్టార్లు గెస్టులుగా వచ్చారు. ఎంతో మంది స్టార్ కొరియోగ్రఫర్లను ఢీ షో అందించింది. అలాంటి ఢీ షో ఇప్పుడు మరీ దిగజారిపోతోంది. న్యాయనిర్ణేతలుగా ఉన్న వాళ్లు తమ హుందాతనాన్ని మరిచిపోతోన్నారు. ప్రియమణి, పూర్ణ లాంటి వాళ్లు కూడా జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అలా ఢీ షో ఇప్పుడు సర్కస్ ఫీట్లకు, కామెడీ స్కిట్లకు, రొమాన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

Advertisement

poorna ks nainika in dhee show

Advertisement

కంటెస్టెంట్‌కు ముద్దు పెట్టిన పూర్ణ Poorna

ఢీ షోలోని కంటెస్టెంట్లు నైనిక, సాయిల ట్రాక్ గురించి తెలిసిందే. ఈ ఇద్దరూ ఆఫ్ స్క్రీన్ కూడా మంచి కెమిస్ట్రీని వర్కవుట్ చేస్తోన్నట్టుంది. అయితే ప్రదీప్, ఆది, సుధీర్, రష్మీ, దీపిక చేసే కామెడీ ఒకెత్తు అయితే.. పూర్ణ పెట్టే ముద్దులు, బుగ్గలు కొరికే పద్దతి మరో ఎత్తు. తనకు డ్యాన్స్ పర్ఫామెన్స్ నచ్చితే చాలు మాస్టర్లు, కంటెస్టెంట్ల బుగ్గలను కొరుకుతుంది.

poorna ks nainika in dhee show

Advertisement

ముద్దులు పెడుతుంది. ఇది వరకే ఎన్నోసార్లు పూర్ణ ముద్దుల మీద ట్రోలింగ్ జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది.అయితే పూర్ణ మాత్రం తన పద్దతి మార్చుకోవడం లేదు. తాజాగా వదిలిన ప్రోమోలోనూ కంటెస్టెంట్ బుగ్గను కొరికింది. కానీ ఈ సారి లేడీ కంటెస్టెంట్‌ బుగ్గను పూర్ణ కొరికింది. నైనిక చేసిన డ్యాన్సు, ఆమె తన నడుమును తిప్పిన తీరుకు పూర్ణ ఫిదా అయింది.

 

poorna ks nainika in dhee show

ఇక సంతోషాన్ని ఆపుకోలేక అలా కొరికేసినట్టుంది. అయితే గణేష్ మాస్టర్ మాత్రం నైనికను ఏకంగా మాధురి దీక్షిత్‌తో పోల్చేశాడు. ఆ వెంటనే సాయి గురించి చెబుతూ.. తనను అనిల్ కపూర్ అనండని అంటున్నాడంటూ ఆది కౌంటర్ వేశాడు.

Advertisement

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి