Home » Entertainment » Poorna Marriage News Viral
Entertainment

Poorna : ఎప్పుడో పెళ్ళైపోయింద‌ని ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన పూర్ణ‌.. ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్స్

Authored By
Sam C
The Telugu News | Published on: October 24, 2022, 4:30 pm
Advertisement

Poorna : వెండితెర‌పై సందడి చేసిన పూర్ణ బుల్లితెర‌పై జ‌డ్జిగా అల‌రించింది. ఆ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియా వేదిక‌గా తెగ సంద‌డి చేసింది. ఈ నేప‌థ్యంలో పూర్ణ‌కి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌చ్చింది.ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది పూర్ణ. మధ్యలో గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బుల్లితెరపై దుమ్ములేపేస్తోంది. బుల్లితెరపై వచ్చిన క్రేజ్ ద్వారా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేసినట్టు అయింది. ఇలా సెకండ్ ఇన్నింగ్స్‌లో పూర్ణకు మంచి అవకాశాలు వస్తున్నాయి. పెద్ద సినిమాల్లో చాన్సులు వస్తున్నాయి. ఇటు సిల్వర్ స్క్రీన్, అటు స్మాల్ స్క్రీన్‌లో పూర్ణ దుమ్ములేపుతోంది.

Advertisement

కొన్ని నెలల క్రితం పూర్ణ త‌న‌కు కాబోయే భర్తను పరిచయం చేసింది. షానిద్ అసిఫ్ అలీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. షానిద్ దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త. ఆయనకు ఒక బిజినెస్ గ్రూప్ ఉంది. ప్రకటించిన వెంటనే నిశ్చితార్థం చేసుకున్నారు. పూర్ణ అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్లో నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేశారు. అయితే కొద్ది రోజులుగా పెళ్లి విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో పెళ్లి క్యాన్సిల్ అయిందనే రూమర్లు వచ్చాయి. కానీ అసలు విషయాన్ని ఇప్పుడు చెప్పింది పూర్ణ. ఆల్రెడీ తన పెళ్లి జరిగిపోయినట్టు ప్రకటించేసింది పూర్ణ. ఆసీఫ్ అలీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది. తమ ఎంగేజ్మెంట్ ఈ ఏడాది మేలో జరిగిందని, జూన్ లో దుబాయ్ వేదికగా తమ పెళ్లి అయ్యిందని అసలు విషయాన్ని ప్రకటించేసింది.

poorna marriage news viral

Advertisement

Poorna : సైలెంట్ మ్యారేజ్..

మే 31న మా నిశ్చితార్థం జరిగింది. జూన్ 12న వివాహం చేసుకున్నాం. అనివార్య కారణాల వలన కొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. పెద్దగా ఎవరికీ ఆహ్వానం పంపలేదని పూర్ణ తెలియజేశారు. ప‌లు కార‌ణాల వ‌ల‌న ఇండియాలో ఉన్న సన్నిహితులు, మిత్రులు, బంధువుల రాలేకపోవ‌డంతో వారి కోసం కేరళలో ఇక రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. పూర్ణ ఇచ్చిన సడన్ షాక్ నుండి ఆమె అభిమానులు ఇంకా తేరుకోలేదు. పూర్ణ లైఫ్ గమనిస్తే ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆమె గతంలో మాదిరే ఉంటున్నారు. ఇటీవ‌ల అఖండ చిత్రంలో కీల‌క పాత్ర పోషించి మెప్పించింది పూర్ణ.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి