Home » Entertainment » Popular Dance Master Couple Entry In Bigg Boss 5 Telugu
Entertainment

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లోకి పాపులర్ డ్యాన్స్ మాస్టర్ కపుల్ ఎంట్రీ..పోల్ పెట్టిమరీ లీక్ చేశారు.

Authored By
vamana sai
The Telugu News | Updated on: August 15, 2021, 8:33 am
Advertisement

Bigg Boss 5 Telugu: రియాలిటీ షో అంటే అంతకముందు వరకు ఎవరికీ తెలీదు. కానీ బిగ్ బాస్ చూశాక అందరికీ రియాలిటీ షో ఇలా ఉంటుందా అని యావత్ దేశ ప్రజలకి ఓ క్లారిటీ వచ్చింది. నవరసాలను ఇందులో కంటెస్టెంట్స్ చూపించడం ఈ షో స్పెషాలిటి. రీల్ లైఫ్‌లో ఎలా ఉంటారో దానికి భిన్నంగా రియల్ లైఫ్ లో ఉన్నారు. ఆ టాప్ సీక్రెట్స్ అన్నీ బిగ్ బాస్ బయట పెట్టేస్తారు. ఇదంతా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని బయట టాక్ ఉన్నా కూడా దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ రియాలిటీ షోకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో ఇప్పటికే 4 సీజన్స్ విజయంతంగా పూర్తి చేసుకుంది.

Advertisement

popular dance master couple entry in bigg-boss-5-telugu-

తాజాగా బిగ్ బాస్ సీజన్ 5కి రంగం సిద్దం అవుతోంది. ఈసారి కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారని తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమోతో సస్పెన్స్ కి తెర దించేసింది స్టార్ మా బృందం. లేటెస్ట్ ప్రోమో టెలికాస్ట్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్‌లోనూ బాగా ట్రెండ్ అవుతోంది. ఈసారి ఎమోషన్స్ పీక్స్ అని తాజా ప్రోమోతో క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు గ్లామర్ కూడా డబుల్ డోస్‌లో ఉండబోతోందట. ఒకవైపు జూనియర్ ఎన్.టి.ఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు మొదలవుతోంది. మరోక వైపు బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు స్టార్ట్ చేసేందుకు నిర్వాహకులు సిద్దం అవుతున్నారు. అయితే ఈసారి ఎవరెవరు బిగ్ హౌజ్‌లో ఉండబోతున్నారు అనేది అత్యంత ఉత్కంఠత నెలకొంది.

Advertisement

Bigg Boss 5 Telugu: ఆట సందీప్, అతని భార్య జ్యోతి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ..?

గత కొన్ని రోజులుగా పార్టిసిపెంట్స్ విషయంలో మాత్రం అంతగా క్లారిటీ రావడం లేదు. కానీ కొందరి పేర్లు బాగా ప్రచారంలో నలుగుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ ఇషా చావ్లా, యాంకర్ రవి, సురేఖా వాణి, యాంకర్ వర్షిణి, బుల్లితెర నటి నవ్యస్వామి, లోబో, ఆర్జే కాజల్, అనీ మాస్టర్ పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. అలాగే ఆట సందీప్, అతని భార్య జ్యోతి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు బాగా ప్రచారం అవుతుంది. ఆట సందీప్ తన సోషల్ మీడియా అకౌంట్ ఓ పోల్ పెట్టాడు. అందులో తమ జోడిని బిగ్‌బాస్‌లో చూడాలని ఎంత మంది అనుకుంటున్నారు..? అని అడిగాడు. ఈ పోస్ట్‌కి 80 శాతం మంది నుంచి పాజిటివ్ గా స్పందించారు. కానీ ఇది జోక్ అని కామెంట్ చేశాడు. మరి ఇది ఎంతవరకు నిజమో గానీ ప్రస్తుతం ఈ మ్యాటర్ బాగా వైరల్ అవుతోంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి