Home » Entertainment » Prabhakar Son Chandrahas Arrest
Entertainment

Chandrahas: బిగ్ బ్రేకింగ్.. ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ పై కేసు నమోదు..?

Authored By
Suma
The Telugu News | Updated on: February 5, 2026 1:59 pm
Advertisement

Chandrahas : బుల్లితెర స్టార్ యాక్టర్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. తన లేటెస్ట్ మూవీ ‘బరాబర్ ప్రేమిస్తా’ ప్రమోషన్స్‌లో భాగంగా పాడిన ఓ పాట ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్ స్వయంగా పాడిన “గుంజి.. గుంజి” అంటూ సాగే పాటలోని పదజాలం తీవ్ర విమర్శలకు గురైంది. ప్రమోషన్ కోసం చేసిన ఈ ప్రయత్నం చివరకు పోలీస్ కేసు వరకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది….

Advertisement

Chandrahas: బిగ్ బ్రేకింగ్.. ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ పై కేసు నమోదు..?

Chandrahas : ప్రమోషన్‌లో పాడిన పాటపై రచ్చ

చంద్రహాస్ పాడిన పాటలో అసభ్యకర పదాలు వినిపించాయంటూ ఈవెంట్ జరిగిన వెంటనే చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఓ రేంజ్‌లో స్పందించారు. “ప్రమోషన్ పేరుతో ఇలా బూతులు అవసరమా?” అంటూ ప్రశ్నలు వేశారు. ఇప్పటికే సినిమాకు ఇచ్చిన యూటిట్యూడ్ ట్యాగ్కు ఈ వ్యవహారం సరిపోతుందని విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు సినీ ప్రముఖులు కూడా ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యువ నటులు సమాజంపై బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

Advertisement

Chandrahas : సీనియర్ జర్నలిస్టు ప్రశ్నలు .. చంద్రహాస్ రివర్స్ ఎటాక్

ఈ వివాదంపై సీనియర్ జర్నలిస్టు అశోక్ వేములపల్లి స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. పాటలోని పదజాలాన్ని తీవ్రంగా తప్పుబడుతూ “ఒక నటుడిగా సమాజానికి ఇచ్చే సందేశం ఇదేనా?” అంటూ ప్రశ్నించారు. దీనిపై చంద్రహాస్ వీడియో మెసేజ్ ద్వారా స్పందించాడు. అయితే క్షమాపణ చెప్పకుండా రివర్స్ ఎటాక్ చేయడం మరింత దుమారం రేపింది. తనపై గతంలో కూడా తీవ్ర విమర్శలు, బూతులు వచ్చాయని వాటిని తాను క్రిటిసిజంలా తీసుకున్నానని చంద్రహాస్ చెప్పాడు. పాటలో వినిపించిన బూతులు ఒరిజినల్ సాంగ్‌లో లేవని స్టేజ్‌పై ఇంపాక్ట్ కోసం తానే సృష్టించానని వెల్లడించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రేక్షకుల నుంచి చప్పట్లు వచ్చాయని కూడా చెప్పుకొచ్చాడు. అంతేకాదు అశోక్ వేములపల్లి తన వీడియోలో కుటుంబాన్ని ప్రస్తావించారని ఆరోపిస్తూ 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ హెచ్చరించాడు.

Chandrahas : పోలీస్ కేసు నమోదు .. నెటిజన్ల మిశ్రమ స్పందన

చంద్రహాస్ హెచ్చరికల నేపథ్యంలో అశోక్ వేములపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో చంద్రహాస్‌పై కేసు నమోదైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ పరిణామం తర్వాత నెటిజన్లు మరోసారి స్పందిస్తున్నారు. ప్రమోషన్స్ వినూత్నంగా చేయడం తప్పు కాదని కానీ అసభ్యకర పదాలు వాడటం మాత్రం సరైంది కాదని హితవు పలుకుతున్నారు. ఇప్పటికే ట్రోల్స్‌తో ఇబ్బంది పడుతున్న చంద్రహాస్‌కు తాజా కేసు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చంద్రహాస్ నుంచి క్షమాపణ వస్తుందో లేదో చూడాల్సిందే. ఇక ‘బరాబర్ ప్రేమిస్తా’ ప్రమోషన్ ఒక అనుకోని వివాదానికి కేంద్రబిందువుగా మారింది.

Advertisement

 

 

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి