prabhas confirmed at the wedding adipurush prerelease event
Prabhas : తిరుపతి వేదికగా జూన్ 6 మంగళవారం సాయంత్రం “ఆదిపురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల మధ్య అద్భుతంగా జరిగింది. బహిరంగ మైదానంలో జరిగిన ఈ వేడుకకు లక్షలాదిమంది ప్రభాస్ అభిమానులు తరలివచ్చారు. చిన్న జీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ వేడుక సాక్షిగా ప్రభాస్ అభిమానులకు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తానని మాట ఇచ్చారు. ఈసారి నుండి మాటలు తక్కువ సినిమాలు ఎక్కువ చేస్తానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పెళ్లిపై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ప్రభాస్ స్పీచ్ ఇస్తుండగా అభిమానులు పెళ్లి ఎప్పుడు అని.. పదేపదే అడగటంతో.. ఇక్కడే తిరుపతిలోనే… పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ సమాధానం ఇవ్వడంతో అభిమానులు చాలా సంతోషపడ్డారు. సినిమా గురించి ఇంకా అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. తన ఇరవై ఒక్క ఏళ్ల సినీ కెరియర్ లో ఏ దర్శకుడు పని చేయని విధంగా “ఆదిపురుష్” కోసం డైరెక్టర్ ఓమ్ రౌత్ కష్టపడటం కళ్ళారా చూశాను. ఇక ఓ సందర్భంలో చిరంజీవి గారిని కలిసిన క్రమంలో రామాయణం చేస్తున్నావా..? అని అడిగారు దానికి అవునని సమాధానం చెప్పాను.
prabhas confirmed at the wedding adipurush prerelease event
ఈ అదృష్టం అందరికి దొరకదు నీకు దొరికింది అని చిరంజీవి గారు నాతో అన్నారు అంటూ ప్రభాస్ కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు. “ఆదిపురుష్” ఆరంభంలో చాలా కష్టాలు పడ్డాం వాటిని ఎదిరించి చివరాఖరికి సినిమాని జూన్ నెలలో విడుదల చేస్తున్నట్లు ప్రభాస్ స్పష్టం చేయడం జరిగింది. ఇక సీత పాత్రలో కృతి సనన్ అద్భుతంగా నటించిందని ప్రభాస్ ప్రశంసించారు.
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…
Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…
This website uses cookies.