
Prabhas : ప్రభాస్ నటించే సినిమాలకి బిజినెస్ పరంగా భారీ ఢీల్ కుదురుతోంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా మారిన ప్రభాస్ కి అన్ని సినిమా ఇండస్ట్రీలలో విపరీతంగా క్రేజ్ నెలకొంది. అంతేకాదు చైనా, జపాన్ లలో కూడా ప్రభాస్ సినిమాలు రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కి అభిమానులు, అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. అందుకే ప్రభాస్ సినిమాలకి అన్నీ రకాలుగా మైండ్ బ్లోయింగ్ బిజినెస్ జరుగుతోంది.
prabhas-deal-is-that-all-industries-records-will-break
అయితే ఇప్పటి వరకు సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో ఏ స్టార్ హీరో సినిమాకి రాని భారీ ఢీల్ సలార్ సినిమాకి వచ్చిందని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు కారణం పాన్ ఇండియన్ క్రేజ్ ఉన్న ప్రభాస్ అండ్ పాన్ ఇండియన్ రేంజ్ లో కేజీఎఫ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా సలార్ రూపొందుతోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
హోంబలే నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఈ ప్రకటన రాగానే ప్రముఖ స్ట్రీంగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఏకంగా 100 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజయ్యాక సలార్ సినిమాని అన్నీ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసుకునేందుకే ఇంత భారీ మొత్తం ఆఫర్ చేసినట్టు తాజా సమాచారం. ఇది నిజమైతే మాత్రం సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో ఒక్క ప్రభాస్ సినిమాకి మాత్రమే ఇంత ఆఫర్ రావడం గొప్ప విషయం.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.