Home » Entertainment » Prabhas Facing Lot Of Troubles After Krishnam Raju Incident
Entertainment

Prabhas : ప్రభాస్‌ను వెంటాడుతున్న కష్టాలు.. పెద్దనాన్న మరణం తర్వాత కొంచెం కూడా గ్యాప్ లేకుండా..?

Authored By
mallesh
The Telugu News | Updated on: September 27, 2022, 5:04 pm
Advertisement

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ఎంత వర్క్ డెడికెటేట్ అని మనందరికీ తెలుసు. ప్రభాస్ కుటుంబం ప్రస్తుతం శోక సంద్రంలో మునిగిపోయింది. వారు ఆ బాధ నుంచి బయటపడాలంటే ఇంకా కాస్త టైం పడుతుంది. కానీ ఏం చేస్తాం.. విధి ఆడిన వింత నాటకంలో ప్రభాస్ ఒక పావులా మారిపోయాడు. పెద్దనాన్న మరణం ఆయన్ను తీవ్రంగా కలిచివేసింది. దీనికితోడు ఇపుడు ఫ్యామిలీకి ఆండగా ఉండకుండా తన వృత్తి అడ్డొస్తుంది.

Advertisement

Prabhas : పాపం ప్రభాస్.. అస్సలు వీలు లేకుండా..

ప్రభాస్ తన పెద్దనాన్న మరణానికి ముందే పలు సినిమాలకు కమిట్ అయ్యాడు. అవి షూటింగ్ దశలో ఉండగానే పెద్దనాన్న మరణం అందరినీ కలిచివేసింది. దీంతో ప్రభాస్ పది రోజుల వరకు షూటింగ్‌కు దూరం అయ్యాడు. ఇప్పటికీ పెద్దనాన్న ఆత్మకు శాంతి చేకూరాలని వారి సొంతం ఊరిలో పెద్దగా సంస్మరణ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో సుమారు 700ల మందికి అన్నదానం చేయించాలని ప్రభాస్ నిర్ణయించారట. ఎందుకంటే తన పెద్దనాన్నకు దానాలు చాలా ఇష్టం. ఆకలితో ఉన్నవారికి ఎన్నోసార్లు కడుపునింపారు. అదేవిధంగా ఆపదలో ఉన్నవారికి సాయం చేశారు.

Prabhas Facing Lot Of Troubles after Krishnam Raju Incident

Advertisement

వారిది రాజుల కుటుంబం కావడం వల్లే కృష్ణం రాజుగారికి అంత ఔదార్యం వచ్చిందని అంటుంటారు. ఇక ప్రభాస్ ఇప్పుడు తన కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయంలో తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టాడట. ప్రస్తుతం ప్రభాస్‌కు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. సలార్, ప్రాజెక్టు కే, మారుతితో కూడా ఒక సినిమా చేస్తున్నాడట..ఇక సలార్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ వేశారట. పది రోజులుగా షూటింగ్ ఆగిపోవడంతో రెంట్ ఎక్కువ అవుతుందట.. తన వలన నిర్మాతలు ఇబ్బంది పడరాదని ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నాడట..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి