Home » Entertainment » Prabhas Foody Person He Do Not Waste Food
Entertainment

Prabhas : ఓడియ‌మ్మ‌.. ప్ర‌భాస్‌కి కూడి ఆ వ్య‌సనం ఉందా?

Authored By
Sam C
The Telugu News | Published on: September 1, 2022, 4:30 pm
Advertisement

Prabhas : బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవ‌తారం ఎత్తాడు ప్ర‌భాస్. బాహుబ‌లి పార్ట్ 1,పార్ట్ 2 చిత్రాల‌లో ప్ర‌భాస్ చేసిన ర‌చ్చ మాములుగా లేదు. అద్భుత‌మైన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టాడు. కేవలం తెలుగు దర్శకులే కాకుండా తమిళ, హిందీ డైరెక్టర్స్ సైతం డార్లింగ్‏తో మూవీస్ చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసేసారు. మరో ప్రక్క ప్రాజెక్ట్ కె, సలార్ చిత్రాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాల్సిన స్పిరిట్ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ గ్యాప్ లో ఓ చిన్న చిత్రం చేస్తున్నారు ప్రభాస్. మారుతితో డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు. ఈ సినిమా ఎప్పుడు మొద‌లు కానుంద‌ని అంద‌రిలో ఆసక్తి నెల‌కొంది.

Advertisement

Prabhas : అంతగానా మ‌రి..

ప్ర‌భాస్ త‌న సినిమా షూటింగ్ స‌మ‌యంలో త‌న సెట్స్‌లో ఉన్న వాళ్ల కోసం ప్ర‌త్యేకంగా భోజ‌నం త‌యారు చేయించి తీసుకొస్తార‌నే విష‌యం తెలిసిందే. ప్రభాస్ తాను తినడంతో పాటు అందరికీ కడుపునిండా భోజనం పెడతాడు. ఈ విషయం చాలామంది చెప్పారు. ప్రభాస్ ఎప్పుడు ఒక్క‌డే కూర్చొని తిన‌డ‌ట‌. ప‌క్క‌డ‌ట ప‌ది మంది అయిన ఉండాల్సాందేన‌ట‌. అదొక వ్య‌సనంలా ప్ర‌భాస్‌కి మారింద‌ని చెబుతుంటారు. కాగా రీసెంట్ గా ప్రభాస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేసింది బాహుబలి నటి. బాహుబలి సినిమాలో చిన్న పాత్ర నటించిన ఈమె రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ బాహుబలి షూటింగ్ సెట్స్ లో ప్రతి ఒక్కరికి భోజనాలు తెచ్చేవాడని.. ఆ టైంలో ఎక్కడైనా సరే అన్నం వేస్ట్ చేసినట్లు కనిపిస్తే ప్రభాస్ కి పిచ్చ కోపం వచ్చి స్పాట్లోనే వాళ్లను అరిచేసేవాడని చెప్పుకొచ్చింది.

Prabhas Foody Person He Do not Waste Food

Advertisement

మిగతా టైంలో అంత సరదాగా ఉన్న ప్రభాస్ ఒక్క ఫుడ్ విషయంలోనే వేస్ట్ చేయగానే అంత కోప్పడిపోతారా అంటూ అక్కడ ఉండే జనాలు చెప్పుకునే వారని ఆమె చెప్పుకొచ్చింది. ఇప్ప‌టికే ప్ర‌భాస్ ఫుడ్ గురించి చాలా మంది స్ట‌న్నింగ్ కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న స‌లార్ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇక సలార్ పూర్తైన వెంటనే డార్లింగ్.. మారుతి మూవీ రెగ్యూలర్ షూట్ స్టార్ట్ కానుందని..ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు… స్క్రిప్ట్ వర్క్‏తో డైరెక్టర్ బిజీగా ఉన్నాడట. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతుందని తెలుస్తోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి