
Prabhas : ప్రభాస్ సినిమాకు పిచ్చెక్కించే టైటిల్.. స్వాతంత్రం ముందు కథతో.. మరో బ్లాక్ బస్టర్ పక్కా అంతే..!
Prabhas : రీసెంట్ గానే కల్కి 2898 ఏడి తో 1000 కోట్ల మార్క్ అందుకున్న ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ పై తన ప్రతాపం ఏంటన్నది చూపించాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉండగా వాటికి తగినట్టుగానే సినిమా ఉండటంతో సూపర్ హిట్ చేశారు ఆడియన్స్. ఇక ప్రభాస్ నెక్స్ట్ సినిమాల మీద కూడా ఈ ఎఫెక్ట్ ఉండేలా కనిపిస్తుంది.కల్కి 1 సెన్సేషనల్ హిట్ కాగా కల్కి 2 ఎలా ఉంటుంది అన్న ఎగ్జైట్ మెంట్ మొదలైంది. ఇక ఈ సినిమా తర్వాత స్పిరిట్ అంటూ ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రభాస్ స్పిరిట్ తర్వాత హను రఘవపుడితో ఒక సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆ సినిమాను కూడా పీరియాడికల్ కథతో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
ప్రభాస్ హను రాఘవపుడి కాంబినేషన్ లో స్వాతంత్రం ముందు కథతో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ 300 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారు. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఫౌజీ అంటే సైనికుడు అని అర్ధం. బిఫోర్ ఇండిపెండన్స్ ప్రభాస్ ఒక సైనికుడిగా ఈ సినిమాలో కనిపించనున్నారు.
Prabhas : ప్రభాస్ సినిమాకు పిచ్చెక్కించే టైటిల్.. స్వాతంత్రం ముందు కథతో.. మరో బ్లాక్ బస్టర్ పక్కా అంతే..!
సీతారామం తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ హను రావపుడి తన నెక్స్ట్ సినిమా కోసం భారీ ప్లానింగ్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ ఏర్పడుతుంది. అందుకు తగినట్టుగానే సినిమాలు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ సలార్ 1 తో సత్తా చాటిన ప్రభాస్ కల్కి తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. రాబోయే సినిమాలు కూడా రెబల్ ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ అందిస్తాయని చెప్పొచ్చు. కల్కి 2, సలార్ 2 తో పాటుగా స్పిరిట్, ఫౌజీ ఇలా వరుస సినిమాలతో ప్రభాస్ తన బాక్సాఫీస్ స్టామినా చూపించేందుకు రెడీ అవుతున్నాడు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.