Home » Entertainment » Prabhas Marriage Issue On Radheshyam Mumbai Press Meet
Entertainment

Prabhas : 2025 వరకు సినిమాలే.. పెళ్లి ఎప్పుడు అంటే ప్రభాస్ సమాధానం ఏంటో తెలుసా?

Authored By
Himanshi
The Telugu News | Updated on: March 3, 2022, 11:23 pm
Advertisement

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా తెరకెక్కిన రాధేశ్యాం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. వచ్చే వారం లో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. తాజాగా ముంబై లో ఈ సినిమా కు సంబంధించిన ప్రీ రిలీజ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. అక్కడ సినిమా రిలీజ్ ట్రైలర్ ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఆ సందర్భంగా ప్రభాస్ మరియు పూజా హెగ్డే మీడియా తో మాట్లాడటం జరిగింది.రాధేశ్యాం సినిమా గురించి చేస్తున్న ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సమయం లో ప్రభాస్ పెళ్లి గురించిన ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.

Advertisement

వాటిని సీరియస్గా తీసుకోకుండా ప్రభాస్ చాలా జోవియల్ గానే సమాధానాలు చెబుతున్నాడు. ప్రభాస్ కి పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా లేదా అంటూ ఒక జర్నలిస్టు అడిగిన ఈ సమయం లో నేను మనిషినే కదా అంటూ సరదాగా వ్యాఖ్యలు చేసాడు. అంటే సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనే అర్థం వస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరో ఇంటర్వ్యూలో మీ పెళ్లి ఎప్పుడూ అంటూ ప్రశ్నించగా సమయం వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుంది.. ప్రస్తుతానికి సినిమాలు చేస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు.

prabhas marriage issue on radheshyam mumbai press meet

Advertisement

2025 వ సంవత్సరం వరకు ప్రభాస్ వరుసగా సినిమాలు చేయబోతున్నాడు. ఈ మూడేళ్ల లో ప్రభాస్ భారీ నుంచి అతి భారీ సినిమాలను చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన పెళ్లి విషయం ఇప్పట్లో ఆలోచించే అవకాశాలు కనిపించట్లేదు. ఇప్పటికి నాలుగు పదుల వయసులో కి ప్రభాస్ వచ్చాడు. మరి పెళ్లి ఐదు పదుల వయస్సు చేసుకుంటాడా లేదంటే సల్మాన్ లా ఒంటరిగా ఉండి పోతారా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి