Bollywood star act in prabhas movie
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్… డార్లింగ్ ప్రభాస్‌కు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ. అమ్మాయిలు అంటే పడి చచ్చిపోతారు. ఒక్కసారైన ప్రభాస్‌ను కలవాలని.. ఫోటోలు దిగాలని కోరుకునే అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో కూడా ప్రభాస్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. పలువురు నటీ నటులు కూడా డార్లింగ్‌ను అభిమానిస్తూ ఉంటారు. ప్రభాస్‌కు ఇంకా పెళ్లి కూడా కాలేదన్న విషయం మనకు తెలిసిందే. ఆయన పెళ్లి వార్త కూడా ఎప్పుడూ వార్తాల్లో హాట్ టాపిక్‌గా ఉంటుంది.
ప్రభాస్ గురించి అందరి మనస్సులో ఉన్న ప్రశ్న ఒక్కటే, ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని. ప్రభాస్ ఒప్పుకోవాలి కానీ అతన్ని పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అమ్మాయిలు రెడీగా ఉంటారు.ఇక ప్రభాస్ ఎప్పుడు మీడియా ముందుకి వచ్చినా అతన్ని అడిగే మొదటి ప్రశ్న కూడా పెళ్లి గురించే. ప్రభాస్ నే కాదు ప్రభాస్ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ప్రభాస్ పెళ్లి గురించే అడుగుతారు. ఇటీవల రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్స్ లో కూడా ప్రభాస్ కి ఈ ప్రశ్న ప్రతి ఇంటర్వ్యూలో ఎదురైంది. తాజాగా మరోసారి ఈ ప్రశ్న ఎదురైంది. ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రభాస్. ఈ ఇంటర్వ్యూలో కూడా ప్రభాస్ ని మీ పెళ్లెప్పుడు అని యాంకర్ అడిగారు. ఎక్కడికి వెళ్లినా తనను దీనిపైనే అడుగుతుంటారని ప్రభాస్ చెప్పారు.
Prabhas marriage news viral
దీన్ని పట్టించుకుంటారా? అని అడగ్గా.. లేదని ఆయన బదులిచ్చారు. ‘‘నా వివాహం గురించి అడిగినప్పుడు నాకేమీ చిరాకు అనిపించదు. ఇది సాధారణ ప్రశ్నే. మీ స్థానంలో నేను ఉన్నా దీనిపై నాకు ఆసక్తి ఉంటుంది’’ అని చెప్పారు.త్వరలో వివాహం చేసుకోబోతున్నారా? అన్న ప్రశ్నకు.. ‘‘దీనికి సమాధానం నా వద్ద ఉన్నప్పుడు తప్పకుండా ప్రకటిస్తా’’అంటూ ప్రభాస్ పెద్దగా నవ్వేశారు. దీంతో ఆయన పెళ్లి కోసం అభిమానులు మరింత కాలం వేచి చూడక తప్పేలా లేదు.అనుష్క, ప్రభాస్ రిలేషన్‌కి సంబంధించి గతంలో చాలా వార్తలు వచ్చాయి. వారి పెళ్లి జరగనుందని వార్తలు రాగా, వాటన్నింటిని ఖండిస్తూనే ఉన్నారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో చూడాలి.
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
This website uses cookies.