Tej comments about Rebel star prabhas
Prabhas : డార్లింగ్ ప్రభాస్ ఇండస్ట్రీలోనే మోస్ట్ బిజియెస్ట్ స్టార్‌గా మారిపోయాడు.ప్రస్తుతం ప్రభాస్ మూడు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు.అందులో ఒకటి ఆదిపురుష్ విడుదలకు సిద్దంగా ఉండగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టుకే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా కమిట్ అయినట్టు ఇండస్ట్రీలో టాక్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ వంటి చిత్రాలు ప్రభాస్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.
కానీ అతని స్టామినాను ప్రపంచానికి, బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాయి. ఇక వచ్చే ఏడాది జనవరిలో ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ట్రైలర్ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది. దీనికి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక స్పిరిట్, ప్రాజెక్టు కే కూడా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఈ టైంలో ప్రభాస్ మారుతి దర్శకత్వంలో కామెడీ హార్రర్ జోనర్ ట్రై చేస్తున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Prabhas Maruti Movie Fans Are Worried
ఇందులో హీరోయిన్లుగా నిధిఅగర్వాల్, మాళవికమోహన్‌తో పాటు కీలక పాత్రలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ నటిస్తున్నారని టాక్. అదే నిజమైతే మరోసారి ప్రభాస్‌కు డిజాస్టర్ పడుతుందేమోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలు మారుతితో డార్లింగ్ ప్రభాస్ ఎందుకు సినిమా కమిట్ అయ్యాడని కూడా కొందరు చర్చించుకుంటున్నారు. గతంలో మారుతి ప్రేమ్ కథా చిత్రమ్ వంటి కామెడీ హార్రర్ మూవీ తీశాడు.అది చిన్న సినిమా, అందులోని స్టార్స్ కూడా చిన్నవాళ్లే కావడంతో పెద్దగా నష్టం లేదు. ఆ సినిమా అదృష్టవశాత్తు హిట్ అయ్యింది. కానీ ప్రభాస్ రేంజ్ ఇప్పుడు హాలీవుడ్ వరకు వెళ్లింది. అలాంటిది ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తే తమకు బ్యాడ్ నేమ్ వస్తుందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.