Prabhas : ఇటీవల సినీ పరిశ్రమలో అతి పెద్ద విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో కొద్దిరోజులుగా గచ్చిబౌలీలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇక కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం సాయంత్రం మొయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్ హౌస్‌లో జరిగాయి. రెబల్ స్టార్ మరణాన్ని సినీ ప్రముఖులు.. అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కృష్ణం రాజు కలిసున్న మధురమైన జ్ఞాపకాలను కొందరు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇక కృష్ణం రాజు ఫ్యామిలీ విషయాల గురించి కూడా కొందరు నోరు విప్పుతున్నారు.
కృష్ణంరాజు మరణం ప్రభాస్ కు తీరని లోటు అనే చెప్పాలి . పెద్దనాన్నని ఎంతో ప్రాణంగా ప్రేమించే ప్రభాస్ ఇప్పుడు ఆయన లేని లోటుని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణించి దాదాపు ఆరు రోజులు కావస్తున్న ఇంకా ప్రభాస్ ఆ విషాదఛాయల్లోనే మునిగిపోయారు . రీసెంట్ గా ప్రభాస్ తీసుకున్న డెసిషన్ రెబెల్ అభిమానుల్లో కంగారు పెట్టిస్తుంది. తన పెద్దనాన్న మృతి కారణంగా ప్రభాస్ దాదాపు మూడు నెలల పాటు అన్ని షూటింగ్స్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడట . ప్రశాంత నీల్ కి ..నాగ్ అశ్విన్ కి.. మారుతికి మూడు నెలలపాటు ఎటువంటి షూటింగ్ షెడ్యూల్ పెట్టుకొని అంటూ కరాఖండిగా చెప్పేసారట.
పెద్ద బడ్జెట్‌తో ప్రభాస్ హీరోగా సినిమాలు చేస్తుండగా, ఇప్పుడు ఆయన మూడు నెలల పాటు సినిమాలు చేయకుండా బ్రేక్ ఇస్తే నిర్మాతలకు ఎంత పెద్ద నష్టం వాటితుల్లుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని కృష్ణంరాజు ఫ్యామిలీకి ఇప్పుడు తానే పెద్ద దిక్కు కావడంతో ఈ మూడు నెలల్లో చెల్లెళ్ల బాగోగులతో పాటు మిగతా కార్యక్రమాలన్నింటిన సెట్ చేయాలని ప్రభాస్ అనుకున్నాడట.ఈ విషయం తెలిసిన శ్యామలాదేవి ప్రభాస్ కి చేతులు జోడించి దండం పెట్టేసిందట. ” నువ్వు నా కడుపున పుట్టకపోయిన.. నువ్వే నా కొడుకు” అంటూ ఎమోషనల్ అయిపోయిందట.ఇప్పుడు ఈ వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్‌లోని…
This website uses cookies.