Home » Entertainment » Pragya Jaiswal Latest Dance Video Viral On Youtube
Entertainment

Pragya Jaiswal : చిరంజీవి పాటకు మాస్ స్టెప్పులతో రెచ్చిపోయిన ప్రగ్యా జైస్వాల్..!

Authored By
mallesh
The Telugu News | Published on: October 13, 2022, 8:00 pm
Advertisement

Pragya Jaiswal : మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానం ఉండని వారు చాలా తక్కువ మంది ఉంటారు. సాధారణ అభిమానులకే కాకుండా చిరు అంటే చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు లైక్ చేస్తుంటారు. అప్పట్లో చిరు నటించిన సినిమాల్లో పాటలు వస్తే కొందరికి ఏదో తెలియని ఊపు వచ్చేది. వారికి తెలియకుండా వారిలో శరీరంలో డ్యాన్స్ జనిస్తుంది. కాళ్లు, చేతులు స్టెప్పులేయాలని ఎదురుచూస్తుంటాయి. తాజాగా చిరు నటించిన రీసెంట్ మూవీ గాడ్ ఫాదర్‌లోని పాటకు బాలయ్య బాబు హీరోయిన్ అదిరిపోయే స్పెప్పులేసింది. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు.

Advertisement

తెలుగులో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. హీరోగా వరుణ్ తేజ్‌కు జోడిగా ప్రగ్యా చాలా మంచి నటనను కనబరిచింది. అనంతరం మంచు మనోజ్ హీరోగా వచ్చిన గుంటూరోడు సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక బోయపాటి దర్శకత్వంలో జయజానకి నాయక మూవీలో ప్రగ్యా సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. ఈ సినిమా మేకింగ్ పరంగా ఓకే అనిపించుకున్నా.. ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందలేకపోయింది. ఇందులో ప్రగ్యా నటనకు పెద్దగా గుర్తింపు దక్కలేదు.

pragya jaiswal latest dance video viral on youtube

Advertisement

Pragya Jaiswal : ప్రగ్యా అదృష్టం మారేనా..

ఇక రీసెంట్‌గా బోయపాటి శీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా అఖండ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కరోనా టైంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో బాలయ్యతో జోడి కట్టిన ప్రగ్యా జైస్వాల్‌కు అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రగ్యా తన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పోస్టు చేస్తుంటుంది. తాజాగా చిరు నటించిన గాడ్ ఫాదర్ మూవీలోని మార్ మార్ టక్కర్ మార్ సాంగ్‌కు ప్రగ్యా అదిరిపోయే స్టెప్పులు వేసింది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చిరు పాటకు ప్రగ్యా ఈ రేంజ్‌లో డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి. మెగా ఫ్యాన్స్ ప్రగ్యా డ్యాన్స్ చూసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి