Prakash Raj Spirit Movie : ‘స్పిరిట్’పై పుకార్లకు ప్రకాష్ రాజ్ చెక్… నా షూటింగ్ ఇంకా మొదలే కాలేదు అంటూ పంచ్..!
Prakash Raj Spirit Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas హీరోగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ Spirit Movie పై ఇటీవల సోషల్ మీడియాలో వినిపించిన వార్తలకు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో విభేదాలు వచ్చాయని, అందుకే ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే ప్రచారం జోరుగా సాగింది.ఈ పుకార్లపై ప్రకాష్ రాజ్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఘాటుగా స్పందించారు.
Prakash Raj Spirit Movie : ‘స్పిరిట్’పై పుకార్లకు ప్రకాష్ రాజ్ చెక్… నా షూటింగ్ ఇంకా మొదలే కాలేదు అంటూ పంచ్..!
Prakash Raj Spirit Movie : పంచ్ అదిరింది…
విషపూరితమైన ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారికి ఒక విషయం చెప్పాలి. ‘స్పిరిట్’ సినిమాలో నా సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. అప్పుడే మీ వాట్సాప్ ఫ్యాక్టరీల్లో కథలు అల్లేస్తున్నారా? కాస్త ఎదగండి… మీ పనులు మీరు చూసుకోండి” అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆయన స్పందనతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలకు పూర్తిగా తెరపడింది.ఈ స్పష్టతతో ప్రకాష్ రాజ్ ‘స్పిరిట్’ సినిమాలో కొనసాగుతున్నారనే విషయం ఖరారైంది. ఆయన పాత్రపై అధికారిక సమాచారం బయటకు రాకపోయినా, ప్రభాస్ తండ్రి పాత్రలో లేదా ఒక ప్రభావవంతమైన పోలీస్ అధికారిగా కనిపించే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
సందీప్ రెడ్డి వంగా స్టైల్‌కు తగ్గట్టుగా ఈ చిత్రం భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకుంటోందని సమాచారం. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఈ చిత్రం మార్చి 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
