Home » Entertainment » Prakash Raj Became Serious About Anupama Parameswaran
Entertainment

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ పై అరిచిన ప్రకాశ్ రాజ్! తప్పు ఎవరిది?

Authored By
mallesh
The Telugu News | Published on: February 19, 2022, 8:30 pm
Advertisement

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ ఈ పేరు గురించి టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అఆ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కేరళ కుట్టి.. తన అందం అభినయంతో యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ఎక్స్ పోజింగ్ లేకుండానే చాలా మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. మొద‌టి చిత్రంతోనే క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ప్రేమ‌మ్‌, శతమానం భవతి వంటి మూవీస్‌లో యాక్ట్ చేసి తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరైంది. గొడవలకు, వివాదాలకు దాదాపుగా దూరంగా ఉండే ఈ భామ.. సీనియర్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ తో గొడవ పెట్టుకుందట.

Advertisement

2018లో వీరిద్దరి కాంబినేషన్‌లో హలోగురు ప్రేమకోసమే అనే మూవీ వచ్చింది. ఇందులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా యాక్ట్ చేశాడు. ఈ మూవీ త్రినాధరావు డైరెక్షన్ లో వచ్చింది. కానీ ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.ఈ సినిమా షూటింగ్ టైంలో ఓ చిన్న విషయంలో వీరిద్దరి మధ్య గొడవ వచ్చిందట. దీంతో సహనం కోల్పోయిన ప్రకాశ్ రాజ్.. అందరి ముందే ఆమెపై అరిచాడట.. దీంతో ఆమె విసుగు చెంది షూటింగ్‌కు రెండు రోజుల పాటు రాలేదట.

prakash raj became serious about anupama Parameswaran

Advertisement

Anupama Parameswaran : అందరి ముందు అరిచాడట..

సినిమా నుంచి పూర్తిగా తప్పుకోవాలని డిసైడ్ అయిందట. తర్వాత హీరో, డైరెక్టర్ ఆమెకు నచ్చజెప్పి మూవీ కంప్లీట్ చేశారట. మ‌రి ఈ వార్తల్లో నిజం ఎంత వరకు ఉందనేది తెలియాలి. కాగ ప్రస్తుతం ఆమె నిఖిల్‌తో 18 పేజెస్, కార్తికేయ2 వంటి మూవీస్ లో యాక్ట్ చేస్తోంది. ఈ రెండు మూవీస్ షూటింగ్ మొదలైంది. ఇదిలా ఉండగా 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ రామ్ కెరీర్‌లో ఓ మాస్ హిట్ గా నిలిచిపోయింది. ఈ మూవీ పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చింది. ఈ మూవీలో రామ్ మాస్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి