Home » Entertainment » Pranita Wearing A Bikini And Making Noise In The Beach
Entertainment

Pranitha : బికినీ వేసుకుని బీచ్ లో సంద‌డి చేస్తున్న ప్ర‌ణిత‌.. గ్లామ‌ర్ డోస్ పెంచి అమ్మ‌డు..

Authored By
mallesh
The Telugu News | Published on: July 21, 2022, 4:30 pm
Advertisement

Pranitha : క‌న్న‌డ బ్యూటీ ప్ర‌ణీత టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. కన్నడలో పోర్కి చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన ప్ర‌ణీత త‌నీష్ హీరోగా వ‌చ్చిన ఏం పిల్లో.. ఏం పిల్లడో మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత సిద్దార్థ్ తో బావ సినిమాలో న‌టించింది. అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అత్తారింటికి దారేదీ.. చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా మెరిసింది. అలాగే మంచు ఫ్యామిలీ న‌టించిన పాండవులు పాండవులు తుమ్మెదలో హీరోయిన్‌గా న‌టించింది. అలాగే ఎన్టీఆర్ యాక్ట్ చేసిన‌ రభసలో సెకండ్‌ హీరోయిన్‌గా చేసింది. వీటితోపాటు డైనమైట్‌, బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమ కోసమే, ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాల్లో మెరిసింది.

Advertisement

అయితే తెలుగులో సెకండ్ హీరోయిన్ గానే స‌రిపెట్టుకుంది. కాగా ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా న‌టించింది. హంగామా 2, భుజ్ వంటి సినిమాల్లో న‌టించింది. ఇక ఇక్క‌డ అంత‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో మ‌ళ్లీ క‌న్న‌డ‌లోనే సెటిల్ అయింది. ఆ త‌ర్వాత ప్రణీత బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజ్ ని పెళ్లి చేసుకుంది. సాంప్రదాయ ప‌ద్ద‌తిలో అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో బెంగళూరులో ప్రణీత ఇంట్లోనే పెళ్లి జరిగింది.

pranita wearing a bikini and making noise in the beach

Advertisement

ఇక ఇటీవ‌ల ప్ర‌ణీత పండంటి బిడ్డ బేబీ గ‌ర్ల్ కి జ‌న్మనిచ్చింది. సోషల్‌ మీడియా మాధ్యమాల ద్వారా ప్రణీత సుభాష్‌ ఈ విషయాన్ని ఎమోష‌న‌ల్ గా పోస్ట్ చేసింది. కాగా సోష‌ల్ మీడియాలో కూడా ప్ర‌ణీత యాక్టివ్ గా ఉంటోంది. అలాగే సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్ కూడా స్టార్ట్ చేయాల‌ని అనుకుంటోంద‌ట‌. కాగా ప్ర‌స్తుతం ప్ర‌ణీత బికినీలో బీచ్ లో వయ్యారంగా న‌డుచుకుంటూ వ‌స్తున్న వీడియో వైర‌ల్ అవుతోంది. దీంతో అభిమానులు టూ హాట్.. బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరుకూడా చూసేయండి..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి