Home » Entertainment » Pranitha Stunning Pic Viral
Entertainment

Pranitha : బేబి బంప్ చూపిస్తూ అభిమానుల మ‌న‌సులు కొల్ల‌గొడుతున్న ప్ర‌ణీత‌

Authored By
Sam C
The Telugu News | Published on: April 13, 2022, 6:30 pm
Advertisement

Pranitha: బెంగళూరు లోనే పుట్టి పెరిగిన కన్నడ భామ ప్రణీత పోకిరి సినిమా కన్నడ రీమేక్ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దర్శన్ హీరోగా నటించిన ఆ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. అదే ఏడాది తెలుగు లో ఏం పిల్లో ఏం పిల్లడో అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత బావ అనే సినిమాలో కూడా నటించింది. అయితే ఆ సినిమాలు ఏవీ ఆమెకు పేరు తీసుకు రాలేదు. అత్తారింటికి దారేది’, మ‌హేశ్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’, జూనియ‌ర్ ఎన్టీఆర్ తో ”ర‌భ‌స”, మంచు విష్ణుతో ”పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద”, రామ్‌తో ”హ‌లో గురు ప్రేమ‌కోస‌మే” చిత్రాల‌తో అల‌రించారు.

Advertisement

క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స కార్మికులు, పేద‌ల‌కు సాయం చేసి త‌న పెద్ద మ‌న‌సును చాటుకున్నారు. గ‌తేడాది ”హంగామా2”, ”భూజ్” సినిమాల‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ప్ర‌స్తుతం ఆమె క‌న్న‌డలో న‌టిస్తున్న ”రామ‌ణ అవాతార” చిత్రం షూటింగ్ ద‌శలో ఉంది. టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత భర్త సుభాష్‌తో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే రీసెంట్‌గా ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాను గర్భవతిని అంటూ.. చేతిలో స్కానింగ్ రిపోర్ట్ కూడా చూపించింది. భర్తను హగ్ చేసుకుంటూ రొమాంటిక్ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది.

pranitha stunning pic viral

Advertisement

Pranitha : ప్రణీత సంద‌డి మాములుగా లేదు..

ప్రణీత తన భర్త నితిన్ 34వ పుట్టినరోజు సందర్భంగా తాను గర్భవతిని అన్న గుడ్ న్యూస్‌ను అభిమానులకు తెలపింది. ఈరోజు నితిన్ (ప్రణీత సుభాష్ భర్త) 34వ పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ, తాను తల్లి కాబోతున్న శుభవార్త ఆమె ఆనందాన్ని రెట్టింపు చేసింది.ప్రణీత తన భర్తతో కలిసి రొమాంటిక్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు.. ఎంజెల్స్ వద్ద మా కోసం ఓ గిఫ్ట్ కూడా ఉందంటూ.. ప్రెగ్నెన్సీ పాజిటివ్ కిట్‌ను చూపించింది ప్రణీత. ఇక తాజాగా త‌న బేబి బంప్‌ని అద్ధంలో చూసుకుంటూ తెగ మురిసిపోతున్న‌ట్టుగా ఉన్న పిక్స్ షేర్ చేసింది. ఇవి నెటిజన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి