Priyamani
Priyamani : నేషనల్ అవార్డ్ విన్నర్ ..హీరోయిన్ ప్రియమణికి ఎంత పెద్ద సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉందో తెలుసా..ఇంత కాలం ఈ విషయం ఎక్కడా బయటకి రాలేదు. తమిళ సినిమా పరుత్తి వీరన్ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న ప్రియమణి తెలుగులో ఎవరే అతగాడు సినిమాతో ఎంటరయింది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయినా మళ్ళీ పెళ్ళైన కొత్తలో సినిమాలో అవకాశం అందుకుంది. జగపతి బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. దాంతో డీసెంట్ రోల్‌తో పాటు గ్లామర్ రోల్స్ చేస్తూ టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
priyamani-has-a-big-movie-background
తెలుగులో మంచి హిట్సే అందుకుంది ప్రియమణి. ఒక్క తెలుగులోనే కాదు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించిన ప్రియమణి ఆయా భాషల్లో సూపర్ హిట్స్ అందుకుంది. నేషనల్ అవార్డ్..ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న ప్రియమణి ముస్తఫా రాజ్‌ని పెళ్ళి చేసుకొని కొన్నేళ్ళు సినిమాలకి దూరంగా ఉంది. అయితే బుల్లితెర మీద డాన్స్ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది. గ్లామర్ ట్రీట్ ఇస్తూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మూడు పదుల వయసు దాటినా కూడా తరగని అందంతో ఆకర్షిస్తోంది.
అయితే ప్రియమణికి మంచి సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉందని చాలా తక్కువ మందికే తెలుసు. ఈ విషయాన్ని ప్రియమణి కూడా ఎక్కడా చెప్పిన సందర్భాలు కూడా అంతగా లేవు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి ప్రియమణి ఒకరకంగా బంధువు అవుతుంది. ప్రముఖ సింగర్ విద్యాబాలన్ కి బంధువు పాపులర్ నేపథ్య గాయకురాలు మల్గుడి శుభకు మేనకోడలే ప్రియమణి. మల్గుడి శుభకి సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో విపరీతమైన పాపులారిటీ ఉంది. తన సాంగ్స్ కి మాస్ ఆడియన్స్ పెద్ద ఫ్యాన్స్ అన్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వెంకటేష్‌తో నారప్ప.. రానాతో విరాట పర్వం సినిమాలు చేస్తోంది.
Wife : వామ్మో.. రోజు రోజుకూ కొందరు మనుషులు మృగాళ్లలా తయారు అవుతున్నారు. భార్యభర్తల మధ్య వచ్చే గొడవలతో.. దంపతులు…
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన భారీ పీరియాడిక్ యాక్షన్…
Komatireddy Raj Gopal Reddy :మునుగోడు నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్…
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన…
Today Gold Price : శ్రావణ మాసం Shravan maas ప్రారంభం కావడం తో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రభావాలు…
Guar : కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో జులై 22న జరిగిన విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. గోరుచిక్కుడు…
Hari Hara Veera Mallu : బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ Pawan Kalan నుండి వచ్చిన తాజా…
Ridge Gourd : అదేంటి బీరకాయ తింటే కూడా అనారోగ్యమా. బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదా అని…
This website uses cookies.