Home » Entertainment » Priyamani Saree Photos Viral
Entertainment

Priyamani : ఎర్ర చీర‌లో వయ్యారాలొలుకుతున్న ప్రియమణి..!

Authored By
mallesh
The Telugu News | Updated on: November 17, 2021 1:28 pm
Advertisement

Priyamani : బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియమణి..మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తోంది. ఓ వైపు వెండితెర, ఓటీటీలు మరో వైపు బుల్లితెరపైన మెరుస్తోంది. యాక్ట్రెస్‌గా, పలు కార్యక్రమాలకు హోస్ట్‌గా ఉంటూ ఫుల్ బిజీ లైఫ్ గడుపుతోంది ప్రియమణి. ‘ఎవరే అతగాడు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కాలంలో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది.

Advertisement

ప్రియమణి తన లేటెస్ట్ ఫొటోషూట్‌కు సంబంధించిన స్టిల్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, అవి నెట్టింట వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో ప్రియమణి చాలా అందంగా కనబడుతోంది. ఎరుపు రంగు చీరలో స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ జాకెట్ ధరించి చూపులతోనే కుర్రకారు మతి పోగొడుతోంది. తను ధరించిన ఆభరణాలు చూపుతూ, ఎర్ర చీర కొంగు చాపుతూ రకరకాల స్టిల్స్ ఇచ్చింది ప్రియమణి.

Priyamani : ఎర్ర చీర‌లో వయ్యారాలొలుకుతున్న ప్రియమణి..!

Advertisement

Priyamani : స్లీవ్ లెస్ జాకెట్‌, రెడ్ కలర్ శారీలో మత్తెక్కిస్తున్న ప్రియమణి..

ఆ ఫొటోలు చూసి నెటిజన్లు హ్యాపీగా ఫీలవవుతున్నారు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఇంత కాలమైనప్పటికీ ఇంకా అందం పెంచేసుకుంటూ ప్రియమణి ముందుకు సాగుతున్నదని నెటిజన్లు అంటున్నారు. ప్రియమణి నటించిన ‘ద ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. మలయాళ, కన్నడ, తమిళ్, తెలుగు భాషల్లో పలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న ప్రియమణి.. మరో వైపున క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తోంది.

తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘నారప్ప’ చిత్రంలో ‘సుందరమ్మ’గా కనిపించిన ప్రియమణి..ప్రస్తుతం ‘మైదాన్, సియాండే, డాక్టర్ 56, కొటేషన్ గ్యాంగ్, ఖయిమార’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ హీరోయిన్‌గా ప్రియమణే నటిస్తుంది. టాలీవుడ్ ఫిల్మ్ ‘విరాట పర్వం’లో ‘కామ్రేడ్ భారతక్క’గా ప్రియమణి నటించింది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి